Paritala Sunitha Allegations on YSRCP MLA: మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల సునీత రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. ప్రకాష్ రెడ్డి కారణంగానే రాప్తాడు నుంచి జాకీ పరిశ్రమ తరలి వెళ్లిందన్నారు. ఆ పరిశ్రమ నుంచి ప్రకాష్ రెడ్డి రూ.15 కోట్లు డిమాండ్ చేశాడని ఆరోపించారు. ఇలా ఉన్న పరిశ్రమలు కూడా తరలిపోయేలా చేస్తే యువత పరిస్థితేంటని ప్రశ్నించారు. జాకీ పరిశ్రమ తరలి వెళ్లడాన్ని నిరసిస్తూ పరిటాల సునీత, నియోజకవర్గ ఇన్‌చార్జి పరిటాల శ్రీరామ్ బుధవారం (మార్చి 23) రాప్తాడులో పాదయాత్ర నిర్వహించారు.
స్థానిక నిరుద్యోగులు, టీడీపీ శ్రేణులతో కలిసి రాప్తాడు తహశీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా పరిటాల సునీత మాట్లాడుతూ.. ప్రకాష్ రెడ్డికి చేతనైతే తరలి వెళ్లిన ఆ కంపెనీని వెనక్కి తీసుకురావాలన్నారు. ఉపాధి కల్పించడం చేతకాని వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్న కంపెనీలను వెళ్లగొడితే యువత ఏం కావాలని నిలదీశారు. పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వ హయాంలో 2017లో రాప్తాడుకు జాకీ పరిశ్రమ వచ్చిందన్నారు.
ఆ పరిశ్రమ ద్వారా 6వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరికేవన్నారు. అలాంటి పరిశ్రమను రాప్తాడు నుంచి తరలి వెళ్లేలా చేశారని మండిపడ్డారు. ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి స్థానిక ప్రజలను వేధిస్తున్నారని.. వారి ఆస్తులు లాగేసుకుంటున్నారని ఆరోపించారు. రాప్తాడు నియోజకవర్గానికి ప్రకాష్ రెడ్డి ఒక గ్రహణం పట్టినట్లు పట్టాడని... టీడీపీ గెలిస్తేనే ఆ గ్రహణం వీడుతుందని పేర్కొన్నారు.
Also Read: Uttar Pradesh: యూపీలో విషాదం.. టాఫీలు తిని నలుగురు చిన్నారులు మృతి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook