ఏపీ, తెలంగాణలో నేడు, రేపు వర్షాలు : వాతావరణ శాఖ

నేడు, రేపు వర్షాలు : వాతావరణ శాఖ

Last Updated : Jun 5, 2019, 11:25 AM IST
ఏపీ, తెలంగాణలో నేడు, రేపు వర్షాలు : వాతావరణ శాఖ

హైదరాబాద్‌: అరేబియా సముద్రంలో ఆవరించిన ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో పలు చోట్ల బుధ, గురువారాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే, ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ ప్రాంతాల్లో మాత్రం వడగాల్పుల ప్రభావం కొనసాగుతుందని అంచనా వేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. 

ఇక కోస్తా, రాయలసీమ ప్రాంతాల విషయానికొస్తే.. ఈ రెండు ప్రాంతాల్లో బుధవారం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతోపాటు అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొన్నారు.

Trending News