Rain updates: 9న మరో అల్పపీడనం.. మళ్లీ వర్షాలు

వాయువ్య బంగాళాఖాతంతో పాటు దానిని ఆనుకుని ఉన్న ఒడిశా తీర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడిందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనానికి అనుబంధంగా వుండే ఉపరితల ఆవర్తనం ప్రభావం కారణంగా మంగళవారం కోస్తాలో పలుచోట్ల ఒక మోస్తరు నుంచి భారీవర్షం కురవగా..  రానున్న రెండు రోజుల పాటు కూడా కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు

Last Updated : Oct 7, 2020, 06:36 AM IST
Rain updates: 9న మరో అల్పపీడనం.. మళ్లీ వర్షాలు

Weather news updates: విశాఖపట్నం: వాయువ్య బంగాళాఖాతంతో పాటు దానిని ఆనుకుని ఉన్న ఒడిశా తీర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం  ( Low-pressure area weakened ) బలహీనపడిందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనానికి అనుబంధంగా వుండే ఉపరితల ఆవర్తనం ప్రభావం కారణంగా మంగళవారం కోస్తాలో పలుచోట్ల ఒక మోస్తరు నుంచి భారీవర్షం ( Heavy rain ) కురవగా..  రానున్న రెండు రోజుల పాటు కూడా కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ( IMD ) తెలిపారు. 

కోస్తాకు వర్ష సూచన ఉన్నప్పటికీ, రాయలసీమలో మాత్రం వాతావరణం పొడిగానే ఉంటుందని వాతావరణ శాఖ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం కోస్తాలో కురుస్తున్న వర్షాలు ఈనెల 9వ తేదీ నుంచి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. Also read : AP & TS:ఏపీలోని ప్రాజెక్టులు ఆపకుంటే..తెలంగాణలో బాబ్లీ తరహా ప్రాజెక్ట్: సీఎం కేసీఆర్

తూర్పు మధ్య బంగాళాఖాతం ( Central east Bay of Bengal ), ఉత్తర అండమాన్‌ సముద్రం ( Andaman Sea ) మధ్య ఈ నెల 9న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. ఈ కారణంగానే ఆ తర్వాత వర్షాలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ అల్పపీడనం ప్రభావం కారణంగా తెలంగాణలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. Also read : AP COVID-19 : తాజాగా 5,795 కరోనా కేసులు.. 33 మంది మృతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News