2019 ఎన్నికల్లో రోజా వర్సెస్ జీవిత

వచ్చే ఎన్నికల్లో రోజాకు ప్రత్యర్ధిగా రాజశేఖర్ సతీమని రాధికను బరిలోకి దించాలని టీడీపీ భావిస్తోంది.

Last Updated : Dec 5, 2017, 08:52 PM IST
2019 ఎన్నికల్లో రోజా వర్సెస్ జీవిత

అటు అసెంబ్లీ ఇటు ప్రజా క్షేత్రంలో టీడీపీపై తరచూ విమర్శల దాడి చేస్తున్న రోజాను దెబ్బతీయాలే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. ఆమె వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పొందే అవకాశాలు లేకుండా చేయాలనే వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారు.  రోజాకు గట్టిగా జవాబిబ్బే మహిళా అభ్యర్ధిగా టాలీవుడ్ హీరోయిన్ జీవిత ( హీరో రాజశేఖర్ సతీమణి )ను ఎంచున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమెను వచ్చే ఎన్నికల్లో  రోజాపై పోటీకి దించుతారని టాక్.

అదే క్రమంలో జీవిత కూడా టీటీడీకి దగ్గరవుతూ వస్తున్నారు.  నంది అవార్డుల కమిటీలో సభ్యురాలిగా ఉన్న జీవిత.. ఇటీవలే అవార్డుల ప్రకటన సందర్భంలో ఆమె చంద్రాబాబు నిర్ణయాన్ని సమర్ధించారు. ఈ సందర్భంలో ఆమెను మీడియా ప్రశ్నిస్తూ.. మీరు టీడీపీలో చేరుతున్నారా ? అని అడిగారు..దీనికి రాధిక బదులిస్తూ మీరు చేరమంటే చేరుతానని జవాబిచ్చారు.

ఈ పరిణామాలతో ఆమె టీడీపీ తీర్థం పుచ్చుకుంటారనే తెలుస్తోంది.  జీవిత  అధికారంగా ప్రకటించపోయినా.. ఆమె టీడీపీ కండువా కప్పుకోవడం ఖాయమని రాజకీయవర్గాల్లో పుకార్లు వినిపిస్తున్నాయి. టికెట్ కేటాయింపుపై స్పష్టత ఇచ్చిన వెంటనే ఆమె టీపీడీలో చేరే విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. అదే జరిగితే నగరి నిజయోకవర్గ పోరు రసవత్తరంగా మారుతుంది. 

Trending News