Sankranti Holidays 2020: ఏపీలో సంక్రాంతి సెలవులు ఇవే.. విద్యార్థులకు పండగే!

తెలుగు వారికి ప్రధాన పండుగలలో సంక్రాంతి ఒకటి. అందులోనూ తెలంగాణకు సంప్రదాయాలకు అనుగుణంగా విజయదశమి (దసరా)కి ప్రాధాన్యం ఉండగా.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఇక పండుగలు అనగానే విద్యార్థులతో పాటు ఉద్యోగులకు గుర్తొచ్చేది సెలవులు.

Last Updated : Jan 7, 2020, 02:01 PM IST
Sankranti Holidays 2020: ఏపీలో సంక్రాంతి సెలవులు ఇవే.. విద్యార్థులకు పండగే!

అమరావతి: తెలుగు వారికి ప్రధాన పండుగలలో సంక్రాంతి ఒకటి. అందులోనూ తెలంగాణకు సంప్రదాయాలకు అనుగుణంగా విజయదశమి (దసరా)కి ప్రాధాన్యం ఉండగా.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఇక పండుగలు అనగానే విద్యార్థులతో పాటు ఉద్యోగులకు గుర్తొచ్చేది సెలవులు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న సంక్రాంతి సెలవురోజుల వివరాలు వచ్చేశాయి. మరో మూడు రోజుల్లో సంక్రాంతి సెలువులు ప్రారంభం కానున్నాయి.

Also Read: తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఇవే.. కానీ!

జనవరి 10 నుంచి ఏపీలోని పాఠశాలలకు సంక్రాంతి సెలవులు అమలు అవుతాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు జనవరి 10 నుంచి 20వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు కొనసాగనున్నాయి. సెలవుల అనంతరం జనవరి 21న పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. స్కూళ్లతో పాటు ఇంటర్ బోర్డు కూడా సెలవుల వివరాలు ఇదివరకే ప్రకటించింది. జూనియర్ కాలేజీలకు జనవరి 11 నుంచి 19వరకు సంక్రాంతి సెలవులు ఇచ్చారు. సెలవురోజుల్లో తరగతులు నిర్వహిస్తే చర్యలు తప్పవని అధికారులు స్కూళ్లు, కాలేజీల యాజమాన్యాలను హెచ్చరిస్తున్నారు. మరోవైపు కోడి పందెలు రోజురోజుకూ జోరందుకుంటున్నాయి.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News