ఢిల్లీ: లోక్ సభలో రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే సభలో ప్రధాని మోడీ స్పూర్తి దాయక ప్రసంగం చేశారు. ఎన్నికలు అనేవి ఐదేళ్లకు ఒక సారి వస్తాయని.. ఎన్నికల్లో గెలుపు కోసమే మనం పనిచేయకూడదన్నారు. వాస్తవానికి మనకు ఎన్నికల్లో గెలుపు కాదు ప్రధానం...ప్రజల కోసం ఏం చేశామనేది ముఖ్యమన్నారు. మంచి పాలన అందిస్తే ప్రజలే మమ్మల్సి ఆదరిస్తారని పేర్కొన్నారు. తమ పనితీరును మెచ్చి మాపై భరోసా ఉంచి అధికారాన్ని కట్టబెట్టిన దేశ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ డెబ్బై ఏళ్ల నుంచి ఉన్న పరిస్థితి మారేందుకు గత ఐదేళ్లలో ప్రయత్నించామని...అయితే మార్పు కోసం మరింత కొంత సమయం పడుతుందన్నారు. పేదరికంతో పాటు అనేక ఇబ్బందులను అధిగమించి దేశం ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని మోడీ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఎప్పుడూ పేదలకు అండగా ఉంటుందని.. అణగారిన వర్గాలైన గిరిజనులు, ఆదివాసీలు ప్రత్యేక దష్టి సారిస్తామన్నారు. రాష్ట్రాల అభివృద్ధికి తగిన చేయూత అందిస్తున్నామ ప్రధాని మోడీ హామీ ఇచ్చారు.