తిరుపతి లడ్డూ ప్రసాదంలో సూది.. సిబ్బందిపై చైర్మన్ ఆగ్రహం!

తిరుపతి లడ్డూ ప్రసాదంలో సూది.. సిబ్బందిపై చైర్మన్ ఆగ్రహం!

Last Updated : Aug 15, 2019, 07:15 AM IST
తిరుపతి లడ్డూ ప్రసాదంలో సూది.. సిబ్బందిపై చైర్మన్ ఆగ్రహం!

తిరుమల : ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం తరచుగా ఏదో ఓ వివాదాలతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా తిరుపతి లడ్డూలో సూది రావడం కలకలం సృష్టించింది. శశాంక్ రెడ్డి అనే భక్తుడికి దేవాలయం సిబ్బంది అందించిన లడ్డు ప్రసాదంలో సూది కనిపించింది. వెంటనే ఆయన ఈ విషయాన్ని టీటీడీ దృష్టికి తీసుకెళ్లి అక్కడి అధికారులకు ఫిర్యాదు చేశారు. 

భక్తుడి ఫిర్యాదుపై వెంటనే స్పందించిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. సంబంధిత సిబ్బందిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. వెంటనే దర్యాప్తు చేపట్టి, నిర్లక్ష్యం ఎక్కడ జరిగిందో పరిశీలించి నివేదిక ఇవ్వాల్సిందిగా స్పెషల్ ఆఫీసర్ ధర్మారెడ్డిని వైవీ సుబ్బారెడ్డి ఆదేశించారు.

Trending News