NTR Bharosa: ఏపీలో మళ్లీ పింఛన్ల పండుగ.. ఈసారి ఎన్ని డబ్బులు వస్తాయో తెలుసా?

Pension Festival In Andhra Pradesh How Much Get Pension Beneficiaries: అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రెండో నెల పింఛన్ల పంపిణీకి సిద్ధమైంది. అయితే ఈ నెల ఎంత మొత్తంలో ఫించన్‌ డబ్బులు వస్తాయోననేది ఆసక్తికరంగా మారింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jul 31, 2024, 08:38 PM IST
NTR Bharosa: ఏపీలో మళ్లీ పింఛన్ల పండుగ.. ఈసారి ఎన్ని డబ్బులు వస్తాయో తెలుసా?

NTR Bharosa Pension: ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం సామాజిక ఫించన్లు పెంచి అందిస్తోంది. ఇప్పటికే జూలై నెలలోనే పెంచిన ఫించన్లను అమలు చేసింది. ఒకటో తేదీనే దాదాపు 95 శాతం పింఛన్లు పంపిణీ చేసి సరికొత్త రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. తాజాగా ఆగస్టు నెలకు సంబంధించి కూడా ఇదే రీతిలో పింఛన్లు పంపిణీ చేయాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. గతంలో జగన్‌ ప్రభుత్వం చేసినట్టుగానే తెల్లవారుజాము నుంచే పింఛన్ల పంపిణీ చేపట్టేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే ఆగస్టు నెలకు పింఛన్‌దారుడికి రూ.4 వేల పింఛన్‌ అందనుంది.

Also Read: Chandrababu Srisailam: చెరిగిపోనున్న సీఎం చంద్రబాబు ముద్ర.. అందరి కళ్లు శ్రీశైలం పర్యటనపైనే?

 

అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక పింఛన్లకు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భరోసాగా పింఛన్ల పేరును మార్చారు. ఇప్పటికే ఈ ఫించన్‌ల పంపిణీ కోసం ప్రభుత్వం రూ.2,737.41 కోట్లు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 64.82 లక్షల మందికి ఆగస్టు 1వ తేదీన ఉదయం 6 గంటల నుంచే పెన్షన్ల పంపిణీని ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్   అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి 1వ తేదీన 96 శాతం, మరుసటి రోజు అంటే 2వ తేదీన వంద శాతం ఫించన్‌ల పంపిణీని పూర్తి చేయాలని ఆల్టిమేటం జారీ చేశారు. వృద్ధులు, వితంతువులకు రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు అందనున్నాయి.

Also Read: AP New Passbooks: సీఎం చంద్రబాబు విస్మయం.. ఒక్క జగన్‌ బొమ్మలకే రూ.700 కోట్లు

 

అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు
గత నెలలో పింఛన్లు పంపిణీ సమయంలో కొన్ని అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఈసారి అలాంటివి చోటుచేసుకుంటే కఠిన చర్యలు తప్పవని సీఎస్‌ హెచ్చరించారు. ఈ మేరకు జిల్లాల కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పింఛన్ల పంపిణీలో కలెక్టర్లు పాల్గొనాలని నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. పెన్షన్లు పంపిణీ ఎవరైనా అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత నెలలో పెన్షన్లు పంపిణీ ఏర్పడిన సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

చంద్రబాబు ఎక్కడంటే?
గత నెలలో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఆగస్టు నెలకు కూడా చంద్రబాబు ప్రత్యక్షంగా హాజరై లబ్ధిదారులకు పింఛన్లు అందించనున్నారు. అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం గుండమల గ్రామంలో చంద్రబాబు పర్యటిస్తారు. అంతకుముందు శ్రీశైలం సందర్శించి భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. అనంతరం శ్రీశైలం ప్రాజెక్టు వద్ద జల హారతి నిర్వహిస్తారు. అక్కడి నుంచి అనంతపురం పర్యటనకు విచ్చేస్తారు. ఈ మేరకు అనంతపురం పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News