Pakistan handover AP fishermen to BSF: పాక్‌ చెర నుంచి క్షేమంగా తిరిగొచ్చిన ఏపీ జాలర్లు

పాకిస్తాన్‌ రేంజర్లు వాఘా సరిహద్దు వద్ద 20 మంది మత్స్యకారులను బీఎస్‌ఎఫ్‌కు అప్పగించారు. ఏపీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత మోపిదేవి వెంకటరమణ ఆ జాలర్లకు స్వాగతం పలికారు.

Last Updated : Jan 6, 2020, 08:48 PM IST
Pakistan handover AP fishermen to BSF: పాక్‌ చెర నుంచి క్షేమంగా తిరిగొచ్చిన ఏపీ జాలర్లు

వాఘా (అమృత్‌సర్‌): పాకిస్థాన్‌లో గత ఏడాది కాలం నుంచి బంధీలుగా ఉన్న 20 మంది ఆంధ్రప్రదేశ్‌ మత్స్యకారులకు ఎట్టకేలకు విముక్తి లభించింది. పాక్‌లోని లంధి జైలులో ఉన్న ఉత్తరాంధ్ర జాలర్లను పాక్‌ అధికారులు ఆదివారం విడుదల చేయడం తెలిసిందే. పాకిస్తాన్‌ రేంజర్లు వాఘా సరిహద్దు వద్ద 20 మంది మత్స్యకారులను బీఎస్‌ఎఫ్‌కు అప్పగించారు. ఏపీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత మోపిదేవి వెంకటరమణ ఆ జాలర్లకు స్వాగతం పలికారు.

ప్రజా సంకల్ప యాత్ర సమయంలో జాలర్ల కుటుంబాలు ఈ సమస్యను వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. జాలర్ల విడుదల కోసం విదేశాంగశాఖతో మాట్లాడాలని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి వైఎస్‌ జగన్‌ సూచించారు. విజయసాయిరెడ్డి కేంద్ర విదేశాంగశాఖతో చర్చలు జరపగా.. అధికారులు భారత జాలర్ల విడుదల కోసం ఇటీవల లేఖ రాశారు. జనవరి 5న లంధి జైలు నుంచి జాలర్లను విడుదల చేసిన అధికారులు ముందుగా చెప్పిన ప్రకారంగానే నేడు (జనవరి 6న) వాఘా సరిహద్దు వద్ద సిబ్బందికి మత్స్యకారులను అప్పగించారు.

Also Read: పాక్‌ చెర నుంచి తెలుగు మత్స్యకారులకు విముక్తి

ఉత్తరాంధ్ర జాలర్లు

 

 

 

 

 

 

 

 

 

కాగా, బతుకుదెరువు కోసం గుజరాత్‌ వలస వెళ్లిన జాలర్లు 2018 డిసెంబర్‌ నెలలో పాక్‌ ప్రాదేశిక జలాల ఏరియాలోకి ప్రవేశించగా.. పాక్‌ సిబ్బంది వారిని బంధించిన విషయం తెలిసిందే. తమ కుటుంబసభ్యులు పాకిస్థాన్‌ నుంచి క్షేమంగా తిరిగిరావడంతో జాలర్ల వారి కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వీరిని ఏపీకి తరలించే చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News