Coronavirus deaths in AP: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ మరణాలు, కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. రాష్ట్రంలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 300 దాటిపోయింది. తాజాగా కర్నూలులో ఒక కరోనా పేషెంట్ చనిపోయాడు. కరోనా బారిన పడి చనిపోయినట్లు అధికారులు నిర్ధారించారు. అంతకుముందు నిర్వహించిన కోవిడ్19 టెస్టుల ఫలితాలు రాగా, పాజిటీవ్‌గా తేలింది. విషాదం.. నిండు గర్భిణిని బలిగొన్న కరోనా మహమ్మారి
కరోనాతో చనిపోయిన వారి సంఖ్య రాష్ట్రంలో నాలుగుకు పెరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ కృష్ణా జిల్లాలో ఇద్దరు చనిపోగా, అనంతపురం జిల్లాలో మరో వ్యక్తి కరోనా కాటుకు బలైన విషయం తెలిసిందే. రాష్ట్రంలో నిన్న సాయంత్రం 6 నుంచి ఈరోజు ఉదయం 9 వరకు జరిగిన కోవిడ్19 పరీక్షల్లో కొత్త గా గుంటూరు లో ఒక కేసు నమోదయింది. రాష్ట్రం లో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసు ల సంఖ్య 304 కి పెరిగింది. కర్నూల్ జిల్లా లో #COVID19 కారణం గా ఒక మరణం నిర్దారించబడింది. కరోనాను జయించిన 10 నెలల బుడ్డోడు
#CovidUpdates: రాష్ట్రంలో నిన్న సాయంత్రం 6 నుంచి ఈరోజు ఉదయం 9 వరకు జరిగిన కోవిడ్19 పరీక్షల్లో కొత్త గా గుంటూరు లో ఒక కేసు నమోదయింది. రాష్ట్రం లో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసు ల సంఖ్య 304 కి పెరిగింది. కర్నూల్ జిల్లా లో #COVID19 కారణం గా ఒక మరణం నిర్దారించబడింది #APFightsCorona pic.twitter.com/lwUFb66kJL
— ArogyaAndhra (@ArogyaAndhra) April 7, 2020
74 కరోనా కేసులతో కర్నూలు జిల్లా అగ్రస్థానంలో ఉండగా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. సన్నీ లియోన్ లేటెస్ట్ బికినీ ఫొటోలు
ఏపీలో కరోనా కేసుల వివరాలు జిల్లాలవారీగా:
అనంతపురం -6
చిత్తూరు - 17
తూర్పు గోదావరి - 11
గుంటూరు - 33
కడప - 27
కృష్ణా - 29
కర్నూలు - 56
నెల్లూరు - 42
ప్రకాశం - 24
విశాఖపట్నం -20
పశ్చిమ గోదావరి - 21
శ్రీకాకుళం - 0
విజయనగరం - 0 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..