AP Ministers Escort Vehicles Flood Relief aras: రెండు తెలుగు రాష్ట్రాలపై వరుణుడు కుండపోతలా వర్షాలు కురిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో.. ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు వర్షానికి విలవిల్లాడిపోతున్నారు. అంతేకాకుండా.. ఎక్కడచూసిన రోడ్ల మీదకు భారీగా నీళ్లు వచ్చి చేరిపోయాయి. తెలంగాణలోని ఖమ్మం, ఏపీలోకి విజయవాడలో వరదలకు విలవిల్లాడిపోయాయని చెప్పుకొవచ్చు.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం వదరల నేపథ్యంలో.. ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ముంపు ప్రాంతాలలో పర్యటిస్తు బిజీగా ఉంటున్నారు. ఇక ఆంధ్ర ప్రేదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు విషయానికి వస్తే.. రెండు రోజుల పాటు ఆయన విజయవాడ వరద ప్రభావితమైన ప్రాంతంలో పలు మార్లు బోటుల్లో వెళ్లి బాధితుల గోడునువిన్నారు.
అంతేకాకుండా.. మంత్రులు, అధికారుల్ని సైతం రంగంలోకి దిగేలా చేశారు. ఎప్పటికప్పుడు మంత్రులు, అధికారులను సమన్వయం చేసుకుంటూ పరుగులు పెట్టించారు. ఏ ఒక్కరి ప్రాణం కూడా పోవడానికి వీల్లేదని, వదరలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం అందించే సహాయం చేరాలని కూడా అధికారులను ఆదేశించారు మరోవైపు వరదల్లో కొంత మంది జగన్ విధేయత అధికారులు.. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చేలా సహాయక చర్యపట్ల పట్టనట్లు వ్యవహరిస్తున్నట్లు కూడా సీఎంకు ఫిర్యాదులు అందాయి. దీంతో సీఎం చంద్రబాబు వీరిపై సీరియస్ అయ్యారు.
ఇష్టంలేకుంటే.. జాబ్ వదిలేసి వెళ్లిపోవాలని కూడా వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా.. ఎప్పటికప్పుడు అధికారలు అలర్ట్ గా ఉంటు బాధితులకు నిత్యవసరాలు, పాలు, పులిహోర, ఆహార పొట్లాలు, మంచి నీరు అందేలా చూడాలన్నారు. మరోవైపు కేంద్రంతో కూడా మాట్లాడుతూ.. అదనంగా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ప్రత్యేక బోట్లు, విమానాలు సైతం తెప్పించుకున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి లోకేష్ కూడా వరద ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యల్లో పాల్గొన్నారు.ఈ క్రమంలో మంత్రి లోకేష్.. చేసిన ప్రతిపాదన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
వరదల నేపథ్యంలో.. మంత్రులు తమ ఎస్కార్ట్ వాహానాలను..వరదల ప్రాంతంలో సహాయక చర్యలలో ఉపయోగించేలా చూడాలని కోరారు. దీంతో మంత్రి లోకేష్ ఈ ఐడియాకు మిగతా సహాచర మంత్రులు సైతం ఓకే చెప్పారు. అంతేకాకుండా.. చాలా మంది స్వచ్చందంగా ముందుకొచ్చి తమ వంతుగా సహాకారం సైతం అందిస్తున్నారు.
Read more: Hydra Ranganath: సీఎం రేవంత్ మరో సంచలనం.. హైడ్రా రంగనాథ్ కు మరో అదిరిపోయే పోస్టు..?..
ఇదిలా ఉండగా.. ఏపీలోని విజయవాడలో ముఖ్యంగా సింగ్ నగర్ తో పాటు పలు ఏరియాలో ఇప్పటికి కూడా వరద తగ్గలేదు. అనేక ఇళ్లలో కూడా వరద నీరు అలానే ఉంది. చాలా మంది తినడానికి తిండిలేక, బట్టలు లేక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ప్రభుత్వం.. డ్రోన్ లు, హెలికాప్టర్ లలో ఆహార పొట్లాలను సరఫరా చేస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Twitterమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి