Bala Krishna Target NTR: జూనియర్ ఎన్టీఆర్ ను బూతులు తిట్టిన బాలయ్య.. పీతలు, కుక్కల పోలికతో రెచ్చిపోతున్న ఫ్యాన్స్

Bala Krishna Target NTR: హెల్త్ యూనివర్శిటీకి పేరు మార్పు అంశం ఏపీలో కాక రేపుతోంది. ఎన్టీఆర్ పేరును తీసివేసి వైఎస్సార్ పేరు పెడుతూ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కొన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేత వస్తోంది. ఎన్టీఆర్ పేరు మార్చడంపై తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేసింది.

Written by - Srisailam | Last Updated : Sep 25, 2022, 01:51 PM IST
Bala Krishna Target NTR: జూనియర్ ఎన్టీఆర్ ను బూతులు తిట్టిన బాలయ్య.. పీతలు, కుక్కల పోలికతో రెచ్చిపోతున్న ఫ్యాన్స్

Bala Krishna Target NTR: హెల్త్ యూనివర్శిటీకి పేరు మార్పు అంశం ఏపీలో కాక రేపుతోంది. ఎన్టీఆర్ పేరును తీసివేసి వైఎస్సార్ పేరు పెడుతూ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కొన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేత వస్తోంది. ఎన్టీఆర్ పేరు మార్చడంపై తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. ఎన్టీఆర్ అభిమానులు భగ్గుమన్నారు. గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు.  నందమూరి, నారా కుటుంబ సభ్యులు తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ నిర్ణయం సరికాదంటూ ఎన్టీఆర్ మనవళ్లు తారక్, కల్యాణ్ రామ్ ట్వీట్లు చేశారు.  అయితే ఏపీకి తలమానికంగా ఉన్న హెల్త్ యూనివర్శిటీకి తన తండ్రి పేరు మార్చడంపై కొంత ఆలస్యంగా స్పందించారు హీరో నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం సినిమా షూటింగ్ లో భాగంగా టర్కీలో ఉన్న బాలయ్య.. రెండు రోజులు ఆలస్యంగా రియాక్ట్ అయ్యారు.

లేటుగా వచ్చిన లేటెస్ట్ గా వచ్చారు బాలయ్య. మార్చేయడానికి,  తీసెయ్యడానికి ఎన్టీఆర్ అన్నది పేరు కాదన్న సింహా.. పంచభూతాలున్నాయ్ తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. సీఎం జగన్ కు వార్నింగ్ ఇస్తూనే జూనియర్ ఎన్టీఆర్ ను బాలయ్య టార్గెట్ చేశారని తెలుస్తోంది.  తన ఫేస్ బుక్ పేజీలో బాలకృష్ణ పెట్టిన కామెంట్ ను పరిశీలిస్తే జూనియర్ ఎన్టీఆర్ ను ఓ రేంజ్ లో తిట్టినట్లు  స్పష్టంగా కనిపిస్తోంది. ఆ మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారు.. పీతలున్నారు.. విశ్వాసంలేని వాళ్లని చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయ్.. శునకాలముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు అని బాలకృష్ణ తీవ్ర పదజాలంతో విరుచుపడ్డారు. ఎన్టీఆర్ పెట్టిన భిక్షతో బతుకున్నారంటూ బాలయ్య చేసిన కామెంట్లు మాజీ మంత్రి కొడాలి నాని, గనన్వరం వల్లభనేని వంశీని ఉద్దేశించే చేసినట్లుగా భావిస్తున్నారు.

కొడాలి నాని, వల్లభనేని వంశీలు జూనియర్ ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితులు. వీళ్లిద్దరని కాదని జూనియర్ ఏ పని చేయరంటారు. 2004లో తనకు జూనియర్ వల్లే టికెట్ వచ్చిందని కొడాలి నాని ఓపెన్ గానే చెబుతుంటారు. ఎమ్మెల్యే వంశీ కూడా ఎన్టీఆర్ తనకు అత్యంత కావాల్సిన వ్యక్తి అని చెబుతారు. ప్రస్తుతం వైసీపీలో ఉన్న ఈ ఇద్దరు నేతలు చంద్రబాబు, నారా లోకేశ్ ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు. నారా కుటుంబంపై వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తుంటారు. అసెంబ్లీలోనూ చంద్రబాబును చీల్చి చెండారారు. ఈ విషయంలో తన సన్నిహితులను కంట్రోల్ చేయడంలో జూనియర్ సైలెంటుగా ఉన్నారనే ఆగ్రహం టీడీపీ శ్రేణుల్లో ఉంది. నారా భువనేశ్వరిపై అసెంబ్లీలో వైసీపీ నేతలు వివాదాస్పద కామెంట్లు చేయడం గతంలో దుమారం రేపింది. ఆ సమయంలోనూ జూనియర్ స్పందన టీడీపీని నిరాశ పరిచింది. జూనియర్ తీరుపై ఆగ్రహంగా ఉన్న బాలకృష్ణ.. తాజా ఎపిసోడ్ లో సీఎం జగన్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ ను టార్గెట్ చేశారనే టాక్ వస్తోంది.

ఎన్టీఆర్ పేరు మార్పు విషయంలో జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన తీరుపై తెలుగుదేశం పార్టీతో పాటు ఎన్టీఆర్ అభిమానుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎన్టీఆర్ తో పాటు వైఎస్సార్ ను మహానీయుడిగా అభివర్ణించడంపై తమ్ముళ్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. తాత పేరు మార్చడంపై సీరియస్ గా స్పందించాల్సిన ఎన్టీఆర్.. గోడ మీది పిల్లిగా వ్యవహరించారని మండిపడ్డారు. జూనియర్ ను ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా వచ్చాయి. ఇది పెద్ద రచ్చగా మారింది. తర్వాత టీడీపీని టార్గెట్ చేస్తూ జూనియర్ అభిమానులు భారీగా పోస్టులు పెట్టారు.

Also Read: Munugode Bypoll : బీసీ లీడర్లు ఆత్మీయులు కారా.. రెడ్డీలకే రెడ్ కార్పెటా? మునుగోడు టీఆర్ఎస్ లో జగదీశ్ రెడ్డి చిచ్చు..

Also Read: Hyderabad: హైదరాబాదీలకు డబుల్ ధమాకా.. ఈ సండే వెరీ స్పెషల్ గురూ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News