'మై ఛానల్ నా ఇష్టం' యూ టూబ్ ఛానల్ వేదికగా నాగ బాబు రెచ్చిపోతున్నారు. ఇప్పటి వరకు బాలయ్యపై సెటైర్ల వర్షం కురిపించి టీడీపీని పరోక్షంగా టార్గెట్ చేసిన నాగబాబు ఇప్పుడు వైసీపీ చీఫ్ జగన్ తీరును విమర్శిస్తూ వైసీపీపై ఎటాక్ చేయడం మొదలెట్టారు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న నాగబాబు కామెంట్స్ ను ఒక్క సారి పరిశీలిద్దాం..
నాలుగు రెట్లు దోచుకుంటారా ? - నాగబాబు
గతంలో జగన్ చేసిన బిర్యానీ కామెంట్స్ ను గుర్తు చేస్తూ నాగబాబు తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్య నేతలు, కార్యకర్తల సమావేశంలో జగన్ మాట్లాడుతూ డబ్బులు పోయామని బాధపడకండి..మన ప్రభుత్వం వస్తుంది.. వచ్చిన తర్వాత మన ప్లేట్ లో మనమే బిర్యానీ తిందామని నేతలు,కార్యకర్తలకు జగన్ అభయమిచ్చారు. ఈ వ్యాఖ్యలను నాగబాబు ప్రస్తావిస్తూ ఒక అభ్యర్ధి గత ఎన్నికల్లో 5 కోట్లు ఖర్చు పెట్టారనుకుందాం..వచ్చే ఎన్నికల్లలో మరో 10 కోట్లు ఖర్చుపెడితే అలాంటి వారు ..వైసీపీ ప్రభుత్వం వస్తే నాలుగు రెట్లు అంటే 60 కోట్లు దోచి ఇస్తారా అంటూ జగన్ ను నాగబాబు ప్రశ్నించారు
డబ్బు విషయంలో జగన్ వైఖరి ఇది.. -నాగబాబు
ఇదే సందర్బంలో పాదయాత్రలోని జగన్ వ్యాఖ్యలకు సంబంధించి ఓ వీడియో ప్లే చేసి దానిపై సెటైర్లు సంధించారు. నాగబాబు పోస్ట్ లోచేసిన ఆ వీడియో ప్రకారం జగన్ పాదయాత్రలో ఉన్నప్పుడు కొందరు నాయకులు ఓ నేతను పార్టీలో చేర్చుకోవాలని సూచించారు.దీనికి జగన్ బదులిస్తూ ఏ ప్రయోజనం.. డబ్బు ఖర్చుపెడతారా అంటూ కామెంట్ చేసినట్లుగా ఉంది. ఈ అంశంపై నాగబాబు స్పందిస్తూ డబ్బు విషయంలో జగన్ దిగజారుడుతనానికి ఇది నిదర్శనమని విమర్శించారు. ఎలక్షన్ కమిషన్ చెప్పిన దాని ప్రకారం ఎవరైనా ఖర్చుపెడతారని..అయితే డబ్బే ప్రధానమంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను ప్రసావిస్తూ డబ్బు పట్ల జగన్ వైఖరి ఇది అని నాగబాబు కామెంట్స్ చేశారు. అభ్యర్ధులకు ఎన్నికల్లో భాగా ఖర్చుపెట్టండి.. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీని ఓ బిర్యానీ ప్లేట్ లా తయారు చేసి దోచుకుందామని జగన్ భావిస్తున్నట్లు స్పష్టమౌతుందన్నారు నాగాబాబు..
ఇలాంటి నాయకుడు మనకు అవసరమా ? -నాగబాబు
జగన్ లాంటి.. అవినీతి,దోచుకునే నాయకుడు.. దేశంలోనే ఎక్కడ కనిపించరని విమర్శించిన నాగబాబు.. ఇది జగన్ ముందున్న విజన్..ఏపీ ప్రజల పట్ల ఉన్న ప్రేమ అని సెటైర్లు వేశారు. ఇలాంటి విజన్ ఉన్న నాయకుడు మనకు కావాలా అంటూ ప్రజలకు నాగబాబు ప్రశ్నించారు. కాగా బాలయ్యను సెటైర్లు సంధించి వివాదానికి తెరతీసిన నాగబాబు..ఇప్పుడు తాజాగా జగన్ పై టార్గెట్ చేసి మరోసారి వివాదాల్లో నిలిచారు. ప్రస్తుతం ఈ అంశం ఎలాంటి వివాదానికి దారి తీస్తుందో మరి..