కాపులను విస్మరించడం న్యాయమా: ముద్రగడ

కాపు సంఘాలకు ఇచ్చిన హామీలను మార్చి 31లోపు ఎట్టిపరిస్థితిలోనైనా నెరవేర్చాలని, లేకపోతే మళ్లీ ప్రభుత్వం ఉద్యమాన్ని చూడాల్సి ఉంటుందని.. తమ ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుందని  కాపు నేత ముద్రగడ పద్మనాభం తెలిపారు

Last Updated : Feb 12, 2018, 01:39 PM IST
కాపులను విస్మరించడం న్యాయమా: ముద్రగడ

కాపు సంఘాలకు ఇచ్చిన హామీలను మార్చి 31లోపు ఎట్టిపరిస్థితిలోనైనా నెరవేర్చాలని, లేకపోతే మళ్లీ ప్రభుత్వం ఉద్యమాన్ని చూడాల్సి ఉంటుందని.. తమ ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుందని కాపు నేత ముద్రగడ పద్మనాభం తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాపులను పూర్తిగా విస్మరించారని.. అందుకే తాము ధర్నాలు, రాస్తారోకోలు చేయాల్సి వస్తుందని ఆయన తెలియజేశారు. కాపు ఉద్యమం కోసం తాను సైతం ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని ముద్రగడ ఈ సందర్భంగా తెలిపారు. గోదవారి జిల్లాల్లో నేడు కాపులు అనేక అవమానాలు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. ఈ విషయాలు అన్నీ పరిగణనలోకి తీసుకొని కాపుల రిజర్వేషనును పది నుండి పన్నెండు శాతం ఇవ్వాలి అని తాను డిమాండ్ చేస్తున్నట్లు ముద్రగడ పద్మనాభం తెలిపారు. 

Trending News