MP Avinash Reddy Video: వెలుగులోకి ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన వీడియో.. వివేకా హత్య రోజు ఏం జరిగిందంటే..?

Avinash Reddy Released Video Over Viveka Murder Case: వివేకా హత్య జరిగిన రోజు ఏం జరిగిందో వివరిస్తూ ఎంపీ అవినాష్‌ రెడ్డి వీడియోను విడుదల చేశారు. ఆ రోజు వివేకా రాసిన లెటర్‌ను రాజశేఖర్ రెడ్డి, సునీతమ్మ ఎందుకు దాచిపెట్టారని ప్రశ్నించారు. సీబీఐ ఎందుకు ఈ లెటర్‌ను డౌన్ ప్లే చేస్తుందని అడిగారు. ఆ వీడియో ఆయన చెప్పారంటే..?  

Written by - Ashok Krindinti | Last Updated : Apr 27, 2023, 02:16 PM IST
MP Avinash Reddy Video: వెలుగులోకి ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన వీడియో.. వివేకా హత్య రోజు ఏం జరిగిందంటే..?

Avinash Reddy Released Video Over Viveka Murder Case: మాజీ మంత్రి వివేకా హత్యలో ఏం జరిగిందో వివరిస్తూ ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన వీడియో విడుదల చేశారు. వివేక హత్య జరిగిన రోజు ఏం జరిగిందనే విషయం కూడా ప్రజల అందరికీ కూడా తెలియాల్సి ఉందన్నారు. ఆయన మాటల్లోనే.. "ఆ రోజు నేను జమ్మలమడుగు వెళుతున్నా.. జీకే కొండారెడ్డి అనే వ్యక్తి వైసీపీలో చేరారు. ఆయనను పార్టీలో చేర్చుకుని.. అక్కడే బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేశా. ఆ కార్యక్రమం అనంతరం నేను పులివెందుల రింగ్ రోడ్డులో ఉండగా.. శివ ప్రకాశ్‌ రెడ్డి గారు ఫోన్ చేశారు. అర్జెంట్‌గా వివేకా బాబాయ్ ఇంటికి వెళ్లమన్నారు. నేను హుటాహుటిన వివేకా ఇంటికి వెళ్లా. బాత్‌ రూమ్‌లో డేడ్ బాడీ ఉందని కృష్ణారెడ్డి తెలిపారు. 

ఏమైనా అనుమానాస్పదం ఉందా..? కృష్టారెడ్డి అని నేను అడగ్గా.. అదేం లేదు సార్ అని చెప్పారు. నేను వెళ్లక ముందే అక్కడ ప్రజలు ముందు పెడుతున్నా. నేను వెళ్లకముందే అక్కడ వివేకా సార్ ఫోన్ ఉంది. ఆయన రాసిన ఓ లెటర్ ఉంది. ఆ రెండు ఉన్న విషయాన్ని నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డికి కృష్ణా రెడ్డి ఫోన్ చేసి చెప్పారు. రాజశేఖర్ మరో ఆలోచన ఆ లెటర్‌ను దాచిపెట్టమని చెప్పారు. ఆ లెటర్‌ ఏముందంటే.. 'నా డ్రైవర్ డ్యూటీకి తొందరగా రమ్మన్నానని చచ్చేలా కొట్టినాడు. ఈ లెటర్ రాయడానికి నేను చాలా కష్టపడ్డాను. డ్రైవర్ ప్రసాద్‌ను వదిలిపెట్టవద్దు. ఇట్లు వివేకానందరెడ్డి..' అని ఆయన రాసిన చివరి మాటలు. రాజశేఖర్ రెడ్డి ఈ లెటర్‌తోపాటు ఫోన్‌ను కూడా దాచిపెట్టమని చెప్పారు. ఈ లెటర్ విచారణలో చాలా కీలకం. ఇదే కీలక ఆధారం.

ఈ లెటర్ ఎందుకు దాచిపెట్టారని నేను రాజశేఖర్ రెడ్డిని.. సునీతను అడిగాను. ప్రసాద్ మంచోడు.. ప్రసాద్‌ను ఎవరైనా ఏమంటారో అని వాళ్లు చెప్పారు. ఇది హస్యాస్పదంగా ఉంది. మీ నాన్న కంటే ఎక్కువ ప్రసాద్‌నే నమ్ముతారా..? సీబీఐ స్టేట్‌మెంట్‌లో సునీతమ్మ ఒక్కోసారి ఒక మాట చెప్పింది. ఒక స్టేట్‌మెంట్‌లో డిటేయిల్స్ చెప్పి.. మరో స్టేట్‌మెంట్‌లో మిస్టేక్స్ కవర్ చేస్తోంది. నేను అలా అనలేదు.. అలా చెప్పలేదు అంటూ చెబుతోంది. వాళ్లకు సీబీఐ పూర్తిగా స్వేచ్ఛనిచ్చింది. అందుకే స్టేట్‌మెంట్‌ను రెండు మూడుసార్లు చెప్పే అవకాశం ఇస్తోంది. 

ఈ రకంగా లెటర్ దాచిపెట్టడం అనేది నా దృష్టిలో ఈ కేసులో బిగ్గెస్ట్ బ్లండర్. ఐఓ రామ్‌సింగ్ అనే వ్యక్తి కన్వినెంట్‌గా డౌన్‌ ప్లే చేస్తున్నాడు. నన్ను విచారణకు పిలిచినప్పుడు లెటర్ ఏం లేదన్నాడు. ఇది పూర్తిగా మర్డర్. ఇలాంటి కేసులో లెటర్‌ను డౌన్ ప్లే చేయడం నాకు ఆశ్చర్యం కలిగించింది. నేను సీబీఐ మొత్తాన్ని బ్లేమ్ చేయట్లేదు. ఐఓ రామ్‌సింగ్ వైఖరి మాత్రం తప్పకుండా తేడాగా ఉంది. ఆ లెటర్‌ ఎవరిని కాపాడేందుకు డౌన్ ప్లే చేస్తున్నారు..? రాజశేఖర్ రెడ్డి, సునీతమ్మ, శివ ప్రకాశ్‌ రెడ్డిని కాపాడేందుకు ఆయన ఇదంతా చేస్తున్నారు. 

ఇది తప్పు కదా..? హత్య గురించి వాళ్లు పోలీసులకు ఎందుకు ముందు ఫోన్ చేయలేదు..? హత్య విషయం ఉదయం 6.10 గంటలకు వాళ్లకు తెలుసు. పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు. అంటే మీ సైడ్ ఏదో తప్పు ఉంది. కాబట్టే లెటర్ విషయం దాచారు. ఊరికే మమ్మల్ని వెళ్లమని చెప్పారు. నేను సీఐకు ఫోన్ చేసి చెప్పాను. వివేకా గారు చనిపోయారు. బాత్‌రూమ్‌లో చనిపోయారు. చాలా బ్లెడ్ ఉంది. తొందరంగా రండి.. అని నేను సీఐ గారికి ఫోన్ చేసి చెప్పాను. నేను ఇంతకు మించి చెప్పిందేమి లేదు..' అని ఎంపీ అవినాష్ రెడ్డి వీడియోలో మాట్లాడారు. 

Also Read: 

Trending News