Breaking News : అగ్రవర్ణాలకూ రిజర్వేషన్లు..కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం

అగ్రవర్ణాలకు మోడీ ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది.

Last Updated : Jan 7, 2019, 05:32 PM IST
Breaking News : అగ్రవర్ణాలకూ రిజర్వేషన్లు..కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం

రిజర్వేషన్లపై మోడీ కేబినెట్ ఈ రోజు కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రవర్ణాలకూ రిజర్వేషన్లు కల్పించాలనే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. రూ.8 లక్షల ఆదాయంలోపు ఉన్న పేదలకు ఈ రిజర్వేషన్లు వర్తిసాయి.అలాగే విద్యా ఉపాది రంగాలల్లో రిజర్వేషన్లు వర్తించనున్నాయి. 1000 గజాల స్థలం, 5 ఎకరాల పొలంటే రిజర్వేషన్లకు అనర్హులని తన గైడ్ లైన్స్ లో పొందుపర్చింది.  తాజా నిర్ణయంతో రిజర్వేషన్ల శాతం 50 నంచి 60 శాతం వరకు పెరగనుంది. మోడీ కేబినెట్ నిర్ణయాన్ని ధృవీకరిస్తు  చేస్తూ ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ANI ఈ మేరకు ట్వీట్ చేసింది.

సవరణ జరిగితేనే సాధ్యం..

మోడీ కేబినెట్ ఆమెదముద్ర వేసిన రిజర్వేషన్ల బిల్లు అమలు జరగాలంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 15, 16 కు సవరణ చేయాల్సి ఉంది.  సభలో పెట్టి 2/3 మెజార్టీ సాధించినప్పుడే రాజ్యంగ సవరణ సాధ్యపడుతుంది. ఈ సమావేశాల్లో రిజర్వేషన్ల బిల్లును సభలో పెట్టి ఆమోదింపజేసుకోవాలని మోడీ సర్కార్ భావిస్తోంది.

కాంగ్రెస్ మద్దతే కీలకం..

అగ్రవర్ణాల బిల్లును మోడీ సర్కార్ సభలో ప్రవేశపెడితే ప్రతిక్షాలు ఏ మేరకు స్పందిస్తాయనే దానిపై సర్వత్రా ఆకస్తి నెలకొంది. ముఖ్యంగా ప్రధానంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ దీనిపై స్పందనే కీలకంగా మారింది. కాంగ్రెస్ మద్దతు తెలిపితేనే బిల్లుకు రాజ్యాసవరణకు నోచుకుంటుంది. అది కాకుండా రాజ్యసభకు మోడీ సర్కార్ కు ఆశించిన స్థాయిలో మెజార్టీ లేదు. ఈ నేపథ్యంలో బిల్లుకు ఎలాంటి మద్దతు లభిస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.

తెరపైకి మరికొన్నిరిజర్వేషన్ల డిమాండ్లు

మోడీ సర్కార్ తీసుకున్న తాజా నిర్ణయంతో మరికొన్ని డిమాండ్ల తెరపైకి వచ్చే అవకాశముంది. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని టీఆర్ఎస్ కోరుతున్న విషయం తెలిసిందే. అలాగే ఎస్సీవర్గీకరణ డిమాండ్ కూడా గత ఎన్నో ఏళ్ల నుంచి వినిపిస్తోంది. అగ్రవర్ణాల బిల్లు సభలోకి వస్తే ఈ డిమాండ్లుకూడా సభ ముందుకు వచ్చే అవకాశముంది. 

 

Trending News