Atchutapuram Gas Leak: అచ్యుతాపురంలో అమోనియా లీక్..పలువురికి అస్వస్థత..సీఎం ఆరా!

Atchutapuram Gas Leak: ఏపీలో మరో గ్యాస్ లీక్ ఘటన కలకలం రేపింది. ఇందులో సుమారు 200 మంది మహిళా కార్మికులు అస్వస్థతకు గురైయ్యారు. వెంటనే వీరిని సమీప ఆస్పత్రికి తరలించారు.

Written by - Alla Swamy | Last Updated : Jun 3, 2022, 07:26 PM IST
  • ఏపీలో మరో గ్యాస్ లీక్ ఘటన
  • పలువురికి అస్వస్థత
  • ఘటనపై సీఎం జగన్ ఆరా
Atchutapuram Gas Leak: అచ్యుతాపురంలో అమోనియా లీక్..పలువురికి అస్వస్థత..సీఎం ఆరా!

Atchutapuram Gas Leak: ఏపీలో మరో గ్యాస్ లీక్ ఘటన కలకలం రేపింది. ఇందులో సుమారు 200 మంది మహిళా కార్మికులు అస్వస్థతకు గురైయ్యారు. వెంటనే వీరిని సమీప ఆస్పత్రికి తరలించారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని బ్రాండిక్స్‌ ఎస్‌ఈజెడ్ పరిధిలోని పోరస్ కంపెనీలో అమోనియా వాయువు లీక్‌ అయ్యింది. దీంతో సమీపంలోని సీడ్స్ కంపెనీలో పనిచేస్తున్న మహిళలు అస్వస్థతకు గురయ్యారు. మహిళలకు తల తిరగడం, కళ్ల మంటలు, వాంతులు అయ్యాయని సిబ్బంది చెబుతున్నారు.

అమోనియా పీల్చడంతోనే మహిళలు స్పృహ తప్పి పడిపోయారని..ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. మరోవైపు పోరస్‌ కంపెనీలో అమోనియా లీకేజీని కాలుష్య నియంత్రణ మండలి గుర్తించింది. లీకేజీని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇటు కంపెనీలో రెండో షిఫ్ట్‌ను రద్దు చేశారు. ఉద్యోగులకు ఇళ్లకు పంపించారు. అమోనియా గ్యాస్ లీక్‌ ఘటనపై సీఎం జగన్ ఆరా తీశారు. ఘటనపై మరిన్ని వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఘటనకు దారి తీసిన కారణాలపై ఆరా తీశారు. వెంటనే సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఈసందర్బంగా అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను సీఎంకు అధికారులు వివరించారు. బ్రాండిక్స్‌లో పనిచేస్తున్న మహిళలను ఖాళీ చేయించామని..బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూస్తున్నామని సీఎం జగన్‌కు తెలిపారు. దీనిపై దర్యాప్తు మొదలు పెట్టామని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని సంబంధిత అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఘటనాస్థలికి వెళ్లి పరిస్థితిని పర్యవేక్షించాలని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ను సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఈక్రమంలోనే ఆయన అక్కడికి వెళ్లారు.

Also read:OPEC Decision: త్వరలో మరింత తగ్గనున్న పెట్రోల్-డీజిల్ ధరలు, ఎందుకంటే

 

Also read: Supreme court: ఆర్య సమాజ్‌లో జరిగే పెళ్లిళ్లు ఇక చెల్లవు..సుప్రీం కోర్టు సంచలన తీర్పు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

 

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

 

Trending News