Minister Roja: హైపర్ ఆదికి మంత్రి రోజా కౌంటర్.. మెగా ఫ్యామిలీ అంటే భయంతోనే అలా..

Minister Roja on Hyper Aadi: కొంతమంది మంత్రులకు శాఖలే తెలియదని అంటున్నారని.. శాఖలు తెలియకుండానే మంత్రులు అయిపోతారా..? మంత్రి రోజా అన్నారు. హైపర్ ఆది చేసిన వ్యాఖ్యలకు ఆమె పరోక్షంగా స్పందించారు. భయంతోనే మెగా ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తున్నారని అన్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 17, 2023, 10:17 AM IST
Minister Roja: హైపర్ ఆదికి మంత్రి రోజా కౌంటర్.. మెగా ఫ్యామిలీ అంటే భయంతోనే అలా..

Minister Roja on Hyper Aadi: కమెడియన్ హైపర్ ఆదికి మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. మెగా ఫ్యామిలీ అంటే భయంతో ఆ కుటుంబంతో ఉన్నారని.. ప్రేమతో ఎవరూ లేరని అన్నారు. టీవీ షోలు, సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటున్నారని.. మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా మాట్లాడితే సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రాకుండాపోతాయని భయంతో మాట్లాడతున్నారన్నారు. నిజంగా మెగా ఫ్యామిలీ అంటే ప్రేమ ఉంటే.. మా అసోసియేషన్ అధ్యక్షుడిగా పోటీ చేసిన ప్రకాష్ రాజ్‌కు సపోర్ట్ చేసినప్పుడు ఏం జరిగిందో అందరికీ తెలిసిందేనని అన్నారు. భయం వేరు.. ప్రేమ వేరు అని అన్నారు.

'ఎవరైతే మంత్రుల గురించి మాట్లాడారో వాళ్లు కూడా ఆలోచించుకోవాలి. మంత్రులకు శాఖలే తెలియదని అన్నారు. శాఖలు తెలియకుండానే మంత్రులు అయిపోతారా..? వాళ్లకు ఏం తెలియదు కాబట్టే జనాలు ఎమ్మెల్యేలుగా కూడా గెలిపించలేదు. మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు ఎంతో సపోర్టివ్‌గా ఉన్నారు. అందుకే మమ్మల్ని గెలిపించారు. ప్రజలు చాలా తెలివైనవారు. మనం అనుకున్నంత అమాయకులైతే కాదు.

సినిమాల వరకు బాగుంటే చూస్తారు. ఎంజాయ్ చేస్తారు. కథ బాగుంటే హిట్ చేస్తారు. కథ బాగోలేందటే ఫ్లాప్ చేస్తారు. కానీ పాలిటిక్స్‌లో మాత్రం వేరు. కోటా శ్రీనివాసరావు గారు గెలిచారు. శారద గారు గెలిచారు. నేను గెలిచాను. బాబు మోహన్ గారు గెలిచారు. కానీ వాళ్లు గెలవలేదు. ఎందుకు..? స్టేజ్‌లు ఎక్కి పిచ్చి మాట్లాడ్డం.. చిన్న చిన్న ఆర్టిస్టులను పెట్టుకుని ఏదంటే అది మాట్లాడించి ఉన్న పరువు కూడా పోగుట్టుకున్నారు. ప్రతిపక్షాల పనికిమాలిన స్టేట్‌మెంట్లు.. వారి బుర్రలో ఉన్న బురదను భోగి మంటల్లో వేయాలని నేను చెప్పాను. ఎందుకంటే ఏ కాంగ్రెస్‌ అయితే కరెక్ట్ కాదాన్నోడో చంద్రబాబు.. అదే కాంగ్రెస్ చంకను ఎక్కాడు. ఏ మోదీని అయితే ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టనివ్వను అని అన్నాడో.. అదే మోదీ చంకను ఎక్కి తిరిగాడు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఎలా తిట్టుకున్నారో మనం అందరం చూశాం. వాళ్లకు నీతినిజాయితీ లేదు..' అని మంత్రి రోజా అన్నారు. 

ఇటీవల రణస్థలం వేదికగా జరిగిన జనసేన యువశక్తి సభలో హైపర్ ఆది మంత్రులపై తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. మంత్రులు ఆ శాఖ.. ఈ శాఖ కాకుండా పవన్‌ కళ్యాణ్‌ను తిట్టేందుకు ఓ శాఖ పెట్టుకోవాలన్నాడు. మంత్రులకు శాఖల గురించే తెలియదన్నాడు. ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్‌ను తిట్టి పాపులారిటీ సంపాదికుందామని చూస్తున్నారని అన్నాడు. మంత్రులకు ఎన్నో శాఖలు ఉన్నాయని.. కానీ వాళ్ల శాఖ గురించి అడిగితే పదో సెకెన్‌కే దొరికిపోతారన్నాడు. ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి. 

Also Read: Amazon Offers: అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్   

Also Read: Telangana Teacher Posts: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో 23 వేల టీచర్ పోస్టులు..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  

Trending News