బోటు ప్రమాదంపై మంత్రి అఖిలప్రియ రియాక్షన్

  

Last Updated : Nov 14, 2017, 12:44 PM IST
బోటు ప్రమాదంపై మంత్రి అఖిలప్రియ రియాక్షన్

విజయవాడ: పవిత్ర సంగమం వద్ద బోటు బోల్తా ఘటనపై ఏపీ పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ స్పందించారు. రివర్ బోటు ఎడ్వెంచర్స్‌ చెందిన బోటులకు తాము అనుమతి ఇవ్వలేదని వెల్లడించారు. దుర్గాఘాట్ వద్ద ఉన్నప్పుడే ఆ బోటును అధికారులు అడ్డుకున్నారని..అయితే దొంగచాటుగా బోటును నడిపారని మంత్రి అఖిలప్రియ ఆరోపించారు.

పరారీలో కొండల్ రెడ్డి టీం...

పోలీసు విచారణలో బోటు నిర్వహకుడు కొండల్ రెడ్డిగా తేలిందని మంత్రి అఖిలప్రియ వెల్లడించారు.. ప్రస్తుతం కొండల్ రెడ్డితో పాటు ఆయన టీం పరారీలో ఉందన్నారు.  నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారని .. ఎట్టిపరిస్థితుల్లో నిందుతులను వదిలే ప్రసక్తేలేదని .. వారు ఎంతటివారైనా సరే శిక్షించి తీరుతామని మంత్రి  తెలిపారు. బోటు యజమాని దగ్గర నుంచి బోటు సిబ్బంది వరకు అందరిపై క్రిమినల్ కేసులు నమోద చేశామని..త్వరలోనే వారందరినీ పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని వెల్లడించారు. చనిపోయినవారిని వెనక్కి తీసుకురాలేముకానీ.. వారికి న్యాయం జరిగేలా చూస్తామని ఈ సందర్భంగా మంత్రి అఖిలప్రియ బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు

Trending News