Michaung Cyclone: దూసుకొస్తున్న మిచౌంగ్ తుపాను, ఏపీలో దంచి కొడుతున్న భారీ వర్షాలు

Michaung Cyclone: మిచౌంగ్ తుపాను ఏపీవైపుకు దూసుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను తీవ్రరూపం దాల్చడంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఏపీలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు ప్రారంభమయ్యాయి. మిచౌంగ్ తుపాను గురించి మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 4, 2023, 10:04 AM IST
Michaung Cyclone: దూసుకొస్తున్న మిచౌంగ్ తుపాను, ఏపీలో దంచి కొడుతున్న భారీ వర్షాలు

Michaung Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుపాను పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోంది. గంటకు 13 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న తుపాను రేపు మధ్యాహ్నం మచిలీపట్నం-నెల్లూరు మధ్య  తీవ్ర తుపానుగా మారి తీరం దాటనుంది. ఫలితంగా ఇప్పటికే ఏపీలో వర్షాలు దంచి కొడుతున్నాయి. తుపాను ప్రభావిత జిల్లాల్లో  ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంది. 

బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుపాను ప్రస్తుతం చెన్నైకు 150 కిలోమీటర్లు, నెల్లూరుకు 250 కిలోమీటర్లు, బాపట్లకు 360 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 380 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఫలితంగా ఇవాళ్ట, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. నెల్లూరు, కృష్ణా, తిరుపతి జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడనున్నాయి. తుపాను ప్రభావంతో ఏపీలోని చాలా ప్రాంతాల్లో రాత్రి నుంచి వర్షాలు ప్రారంభమయ్యాయి. రాయలసీమపై కూడా తుపాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. 

మిచౌంగ్ తుపాను ప్రభావంతో  తీరం వెంబడి గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ అయ్యా.యి. మిచౌంగ్ తుపాను కారణంగా అటు తమిళనాడులో చెన్నై సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. చెన్నై నగరంపై తుపాను ప్రభావం గట్టిగా ఉంది. తాంబరం ప్రాంతంలో ప్రజల్ని ఖాళీ చేయించారు. చెన్నైలో పలు ప్రాంతాలు ఇప్పటికే జలమయమయ్యాయి. 

వాతావరణ శాఖ అంచనా వేసినట్టే ఏపీ, తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను తీవ్రత దృష్ట్యా కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. ప్రకాశం , నెల్లూరు జిల్లాల్లో కూడా విద్యా సంస్థలకు సెలవులిచ్చారు. మిచౌంగ్ తుపాను ప్రబావం ఏపీపై ముఖ్యంగా నెల్లూరు, కృష్ణా, ఎన్టీఆర్ తిరుపతి జిల్లాల్లో తీవ్రంగా ఉండనుంది. మరోవైపు ఏలూరు, పశ్చిమ, తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో కూడా ఉదయం నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. 

రేపు మద్యాహ్నం తీవ్ర తుపానుగా తీరం దాటే సమయంలో ప్రబావం మరింత తీవ్రంగా ఉండనుంది. ఇప్పటికే తీర ప్రాంతాల్లో  రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ముందు జాగ్రత్త చర్యగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీ ఆర్ఎఫ్ బృందాల్ని మొహరించారు

Also read: Michaung Cyclone: ఏపీవైపుకు దూసుకొస్తున్న మిచౌంగ్ తుపాను, డిసెంబర్ 5 వరకూ అతి భారీ వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News