Mega Star Chiranjeevi : దక్షిణాదిన బీజేపీనీ మరింత బలపర్చేందుకు మోదీ, అమిత్ షాలు మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. ఒక వైపు జమిలి ఎన్నికలంటూ ప్రచారం జరుగుతున్న తరుణంలో బీజేపీ తన రాజకీయ వ్యూహాలను పదును పెడుతుంది. దక్షిణాదిన ఆయా రాష్ట్రాల్లో బీజేపీనీ వ్యవస్థీకృతంగా స్ట్రెంథెన్ చేయడానికి కసరత్తు ప్రారంభించింది. అందులో భాగంగా ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో బీజేపీ పెద్దలు అత్యంత సన్నిహిత సంబంధాలు నెరుపుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు రాజకీయంగా మోదీ, అమిత్ షా గైడ్ చేస్తున్నారు. ఎన్డీయే కూటమిలో పవన్ కళ్యాణ్ ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత కలిగిన భాగస్వామిగా నిలిచారు. పవన్ మాటలకు బీజేపీ అధిష్టానం అత్యంత విలువ ఇస్తుంది. మొన్నటి ఏపీ సార్వత్రికి ఎన్నికల్లో కూటిమిగా ఏర్పడడానికి , అలాగే కూటమి అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ అనే కారణమని ఏపీ రాజకీయవర్గాలతో పాటు కూటమి భావన.అలాంటి పవన్ ను ఇప్పుడు రాజకీయంగా దక్షిణాదిన మరింత వాడుకోవాలని బీజేపీ యోచిస్తుంది.
ఈ మధ్య కాలంలో పవన్ సనాతన ధర్మం పేరుతో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారారు. పవన్ సనాతన ధర్మం ఎజెండా ఎత్తుకోవడానికి వెనుక బీజేపీ ఉందని రాజకీయ విశ్లేషకుల అంచనా. గతంలో ఎప్పుడూ లేని విధంగా పవన్ తిరుమల లడ్డు అంశం తర్వాత సనాతన ధర్మం అంశాన్ని ప్రస్తావించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒర రకంగా చెప్పాంటే అప్పటి వరకు ఉన్న పవన్ ఎజెండా ఒక్క సారిగా మారిపోయింది. బీజేపీ మూల సిద్దాంతాన్ని పవన్ ఎత్తుకోవడంతో బీజేపీ, పవన్ ఒకటే అనే సందేహం అందరిలో కలిగిందది. అంతే కాదు ఏపీ రాజకీయాలకు సంబంధించి ఎప్పటికప్పుడు మోదీ, అమిత్ షా సమాచారాన్ని తీసుకుంటున్నారు. అంతే కాదు అవసరాన్ని బట్టి పవన్ ను పిలిపించుకొని మాట్లాడుతున్నారు.
ఇదే క్రమంలో తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం అమిత్ షాతో పవన్ భేటీ చాలా ఆసక్తిగా మారింది. పవన్ తో భేటీలో అమిత్ షా ఒక కీలక ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తుంది. పవన్ తో పాటు పవన్ సోదరుడు, మాజీ కేంద్ర మంత్రి మెగా స్టార్ చిరంజీవిని కూడా రాజకీయాల్లో మరోసారి ఆక్టివ్ చేయాలని అనుకుంటుందంట. దానిలో భాగంగా పవన్ తో అమిత్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఏపీలో త్వరలో రాజ్యసభలో ఖాళీలు ఏర్పడబోతున్నాయి. బీజేపీ, జనసేన తరుపున చిరంజీవినీ రాజ్యసభకు పంపితే ఎలా ఉంటుందనే చర్చ వారి మధ్య వచ్చిందంట. అంతే కాదు చిరంజీవికీ కేంద్ర మంత్రి పదవి కట్టబెడితే రాజకీయంగా బీజేపీ, జనసేనకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
ఐతే చిరంజీవికి ఎందుకు ఇవ్వాలనుకుంటుందా అనే దానికి బీజేపీలో ఒక ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఏపీలో ఎంత లేదన్నా సామాజిక వర్గాల ప్రభావం రాజీకయాల్లో ఉంటుందనేదది సుస్పష్టం. ఇప్పటికే కమ్మ సామాజిక వర్గం టీడీపీకీ అండగా నిలబడుతుంది. రెడ్డి సామాజికవర్గం వైసీపీకీ మద్దతుగా ఉంటుంది.ఇక మరో కీలక సామాజికవర్గం ఐనా కాపులను బీజేపీ సపోర్ట్ తీసుకోవాలనుకుంటుంది. అందులో భాగంగా బీజేపీ జనసేనతో కలిపి ఏపీలో రాజకీయాల్లో కీ రోల్ ప్లే చేయాలనుకుంటుంది. ప్రస్తుతానికి కూటిమి గా ఉన్న భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ పరిస్థితులు వచ్చినా పోటీలో ఉండేలా పక్కా స్కెచ్ గీస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు చిరంజీవి పేరు తెర మీదకు తెస్తుందని చెబుతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కేవలం ఏపీయే కాకుండా తెలంగాణతో పాటు దక్షిణాదిన పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇది సౌత్ ఇండియాలో బీజేపీకీ మంచి ఓటు బ్యాంకుగా ఉపయోగపడుతుందనేది బీజేపీ భావన. ముఖ్యంగా ఇప్పటికే పవన్ ను సనాతన ధర్మం పేరుతో దేశ రాజకీయాల్లో కీలకంగా మార్చిన బీజేపీ తదుపరి చిరంజీవిని కూడా అదే విధంగా రాజకీయంగా వాడుకోవాలనకుంటుంది. అసలే జమిలి ఎన్నికలంటూ దేశ వ్యాప్తంగా తెగ ప్రచారం జరుగుతుంది. ఏ సమయంలో ఎన్నికలు వచ్చినా సంసిద్ధంగా ఉండాలనే లక్ష్యంతో బీజేపీ ఇలాంటి వ్యూహాలకు పదును పెడుతుందని తెలుస్తుంది.
ఎన్నికల సమయంలో ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కేంద్ర మంత్రిగా చిరంజీవి ఇద్దరూ కీలక పదవుల్లో ప్రచారంలో పాల్గొంటే పొలిటికల్ గా పెద్ద అడ్వంటేజ్ గా మారే అవకాశం ఉంటుందని బీజేపీ అంచనా వేస్తుంది.అందుకే ఈ మెగా బ్రదర్స్ కు బీజేపీ పెద్దలు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తుంది. పవన్, చిరంజీవితో దీర్ఘకాలిక ప్రయోజనాల్లో భాగంగా వాడుకోవాలన్నది బీజేపీ ఆలోచన. అందుకే పవన్ తో ఇప్పుడు ఈ విషయం రాయబారం నడుపుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతానికి బీజేపీ ప్రపోజల్ ను పవన్ తో చిరంజీవికి పంపింది. ఐతే చిరంజీవి మాత్రం ప్రస్తుతానికి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట. కానీ జనసేన నేతలు, అభిమానుల నుంచి మాత్రం చిరంజీవిపై తీవ్ర ఒత్తిడి ఉందని తెలుస్తుంది.
గతంలో ప్రజారాజ్యం పార్టీతో వచ్చిన మంచి అవకాశం కోల్పోయాము. ఈ సారి ఎలాగైనా ఏపీ రాజకీయాల్లో పట్టు సాధించాలని ఫ్యాన్స్ మెగాస్టార్ పై ఒత్తిడి తెస్తున్నారట.మొన్నటి ఎన్నికల్లో జనసేన సూపర్ విక్టరీతో మెగా అభిమానుల ఆలోచనలు మారిపోయాయి. ఇక నుంచి తమ అభిమాన నాయకుల హవా కొనసాగుతుందనే విశ్వాసాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా పవన్, చిరంజీవి హీరోలుగా మిగిలిపోతారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.గత అనుభవాల దృష్ట్యా ఇక రాజకీయంగా కూడా కీలకంగా అడుగులు వేయాలని చిరంజీవి అభిమానులు కోరుతున్నారు. మన శక్తి తెలిసి కాళ్ల దగ్గరకు అవకాశాలు వస్తున్నప్పుడు చేజార్చుకోవద్దని చిరంజీవికి ప్యాన్స్ సూచిస్తున్నారు.
మొత్తానికి బీజేపీ పెద్దలు పెట్టిన ప్రతిపాదనను మెగాస్టార్ చిరంజీవి అంగీకరిస్తారా. ఒక వేళ అంగీకరిస్తే కేంద్రం మెగా స్టార్ కు ఏలాంటి పదవి ఇవ్వబోతుంది..? ఏపీతో పాటు దక్షిణాదిన చిరంజీవినీ బీజేపీ ఎలా రాజకీయంగా ఉపయోగించుకోవాలనుకుంటుంది అనేది మాత్రం తేలాల్సింది భవిష్యత్తులోనే.
Also Read: Amruth Scam: రేపు బాంబు పేల్చనున్న కేటీఆర్.. రేవంత్ రెడ్డి అవినీతిపై ఢిల్లీస్థాయిలో పోరాటం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Mega Star Chiranjeevi : త్వరలో మెగా స్టార్ చిరంజీవికి కీలక పదవి, పవన్ తో అమిత్ షా చెప్పింది ఇదేనా..?