విశాఖలో మళ్లీ మావోయిస్టుల వార్ ప్రారంభం..!

విశాఖ జిల్లాలో ఆంధ్రా ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో మళ్లీ మావోయిస్టుల కదలికలు తీవ్రతరం అవుతున్నాయి. 

Last Updated : Feb 12, 2018, 07:31 PM IST
విశాఖలో మళ్లీ మావోయిస్టుల వార్ ప్రారంభం..!

విశాఖ జిల్లాలో ఆంధ్రా ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో మళ్లీ మావోయిస్టుల కదలికలు తీవ్రతరం అవుతున్నాయి. ఇరు రాష్ట్రాల బోర్డర్ వద్ద ఈ రోజు ఉదయం నుండి పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భారీస్థాయిలో కాల్పులు జరగడమే అందుకు ఉదాహరణ. ఈ కాల్పుల సందర్భంగా పోలీసులు రాష్ట్రంలో మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ఇతర చోట్ల కూడా నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు.

ఈ రోజు ఉదయం నుండి విశాఖ, ఒరిస్సా బోర్డర్ ప్రాంతంలో గల గేదెలపాడు ఏరియాలో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. భారీ సంఖ్యలో అక్కడ మావోయిస్టులు కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు.. కాల్పుల సమయంలో కూడా భారీ స్థాయిలో మావోయిస్టులు ఏరియాలోకి వచ్చినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆ ప్రాంత సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాహుల్ దేవ్ శర్మ తెలిపారు. 

Trending News