Madhya Pradesh Politics: కాంగ్రెస్ పార్టీకు కీలకమైన నేతలు గుడ్ బై చెబుతున్నారు. మధ్యప్రదేశ్ తాజా మాజీ ముఖ్యమంత్రి, పార్టీ సీనియర్ నేత కమల్ నాథ్ పార్టీను వీడనున్నట్టు తెలుస్తోంది. త్వరలో కాషాయం కండువా కప్పుకోవచ్చని సమాచారం. అసలు నిజమేంటి, పార్టీ వర్గాలు ఏమంటున్నాయో చూద్దాం.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధికారం కోల్పోవడంతో రాజస్థాన్ తాజా మాజీ ముఖ్యంత్రి కమల్ నాథ్ ఇప్పుడు ఆ పార్టీలో కొనసాగే పరిస్థితులు కన్పించడం లేదని తెలుస్తోంది. త్వరలో పార్టీని వీడి కాషాయ పార్టీలో చేరనున్నట్టు వార్తలు వ్యాపిస్తున్నాయి. దశాబ్దాలుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న కమల్ నాథ్ పార్టీని వీడనుండటం కాంగ్రెస్ పార్టీకు జీర్ణం కావడం లేదు. మరి కొద్దిరోజుల్లో ఎన్నికలున్న తరుణంలో పార్టీ నుంచి కీలక నేతలు బయటకు పోతుండటం పార్టీని ఇబ్బందుల్లో పడేస్తోంది. ఇప్పటికే ఇండియా కూటమి నుంచి కొన్ని పార్టీలు జారుకున్నాయి. ఇప్పుడు సీనియర్ నేతలు కూడా పార్టీని వీడుతున్న పరిస్థితి కన్పిస్తోంది.
ఈ మధ్యనే మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ సైతం కాంగ్రెస్ పార్టీకు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. రాజ్యసభకు నామినేషన్ కూడా వేశారు. ఇప్పుడు కమల్ నాథ్ సైతం అదే బాటలో పయనించే అవకాశాలు కన్పిస్తున్నాయి. రాజ్యసభ స్థానం ఆశిస్తే తన పేరు కాకుండా అశోక్ సింగ్ పేరును పార్టీ అధిష్టానం సూచించడమే కమల్ నాధ్ అసంతృప్తికి కారణమని తెలుస్తోంది. త్వరలో కొడుకు నకుల్ నాథ్‌తో కలిసి బీజేపీలో చేరనున్నట్టు వార్తలొస్తున్నాయి. అయితే ఈ వార్తల్ని అటు కమల్ నాథ్ ఇటు కాంగ్రెస్ సీనియర్ నేతలు కొట్టిపారేశారు. ఇందిరా గాంధీతో సాన్నిహిత్యమున్న సీనియన్ నేత కమల్ నాథ్ పార్టీ వీడటం అసంభవమని అంటున్నారు.
కానీ కొడుకు నకుల్ నాథ్ మాత్రం తన సోషల్ మీడియా బయో నుంచి కాంగ్రెస్ పార్టీ పదాన్ని ఇటీవల తొలగించారు. ఇద్దరి భవిష్యత్ గురించి బలమైన హామీ లభిస్తే కచ్చితంగా పార్టీ వీడే అవకాశాలున్నాయనేది సమాచారం. ఇటీవల జరిగిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి కారణం కమల్ నాధ్ వైఫల్యమేననేది రాహుల్ గాంధీ అభిప్రాయంగా తెలుస్తోంది. అందుకే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బాధ్యతల్నించి కమల్ నాథ్‌ను తొలగించి జీతూ పట్వారీకు కట్టబెట్టినట్టు వార్తలొచ్చాయి.
కమల్ నాథ్ మాజీ మీడియా సలహాదారుడు ప్రస్తుత బీజేపీ అధికార ప్రతినిధి అయిన నరేంద్ర సలూజా, కమల్ నాథ్, నకుల్ నాథ్‌లు భోపాల్ లో దిగిన ఓ ఫోటోను ఎక్స్‌లో పోస్ట్ చేసిన కమల్ నాథ్ జై శ్రీరామ్ అని రాశారు. అప్పట్నించి ఈ కమల్ నాథ్ బీజేపీలో చేరుతున్నారనే వార్తలు వ్యాపిస్తుున్నాయి.
Also read: West Bengal: అక్బర్, సీతా.. సింహాలకు వివాదస్పదంగా పేర్లు.. కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వీహెచ్ పీ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook