Heavy Rains Alert: ఏపీలోని ఆ ఆరు జిల్లాల్లో భారీ వర్ష సూచన

Heavy Rains Alert: ఆంధ్రప్రదేశ్‌లోని ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ అయింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని..ఫలితంగా భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 30, 2021, 09:24 AM IST
 Heavy Rains Alert: ఏపీలోని ఆ ఆరు జిల్లాల్లో భారీ వర్ష సూచన

Heavy Rains Alert: ఆంధ్రప్రదేశ్‌లోని ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ అయింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని..ఫలితంగా భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

బంగాళాఖాతంలో మరోసారి అల్పపీడనం(Low Depression)ఏర్పడింది. ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం మీదుగా ఏర్పడిన రుతుపవన ద్రోణి ఆగ్నేయదిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకూ కొనసాగుతోంది. ఫలితంగా రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో భారీ వర్షాలు పడవచ్చని ఐఎండీ(IMD)సూచించింది. ఈ నెల 30, 31 తేదీల్లో కోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో(Bay of Bengal) ఏర్పడిన అల్పపీడనం(Low Depression) కారణంగా రాష్ట్రంలోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. గత 24 గంటల్లో సత్తెనపల్లిలో 8.3 సెంటీమీటర్లు, కాకుమానులో 8, గుంటూరులో 7.9, రాజాంలో 7.5, నిజాంపట్నంలో 7.1, పొన్నూరులో 6.3, నాగాయలంకలో 5.8, మార్తూరులో 5.5, తెనాలిలో 5.4 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని ఆ ఆరు జిల్లాల్లో మాత్రం రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు(Heavy Rains)పడనున్నాయి. 

Also read: నిరుద్యోగులకు శుభవార్త: ఏపీ విద్యుత్‌ సంస్థలో 398 ఉద్యోగ ఖాళీలు..దరఖాస్తులు ఎప్పటి నుంచంటే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News