Weather Live Updates: వణికిస్తున్న వరుణుడు.. నీట మునిగిన ఊర్లు

Today Rains Live Updates: తెలుగు రాష్ట్రాలపై వరుణుడు పగపట్టినట్లున్నాడు. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో ఏపీ, తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.  

Written by - Ashok Krindinti | Last Updated : Sep 2, 2024, 11:34 AM IST
Weather Live Updates: వణికిస్తున్న వరుణుడు.. నీట మునిగిన ఊర్లు
Live Blog

Rains Live Updates in Andhra Pradesh and Telangana: వరుణుడి దెబ్బకు తెలుగు రాష్ట్రాలు వణికిపోతున్నాయి. అల్ప పీడన ప్రభావంతో ఆకాశానికి చిల్లు పడిందా అనే రీతిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. వరద ఉధృతికి పలు చోట్ల రోడ్లు, రైల్వే ట్రాక్‌లు తెగిపోయాయి. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గతంలో ఎన్నడూ లేనంతగా విజయవాడ పరిసర ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ఇక హైదరాబాద్‌లో వరుణుడి ప్రభావంతో నగరవాసులు అల్లాడిపోతున్నారు. రోడ్లపై వర్షపు నీరు చేరడంతో ట్రాఫిక్‌ కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో నేడు రెండు తెలుగు రాష్ట్రాలలో స్కూల్స్, కాలేజీలకు హాలీ డే ప్రకటించారు. వర్షాలకు సంబంధించి లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి

2 September, 2024

  • 11:34 AM

    Heavy Rain Alert in Telangana: ఖమ్మం మున్నేరుకు క్రమంగా వరద తగ్గుతుంది. ప్రస్తుతం మున్నేరు వద్ద ప్రమాదకర స్థాయికి తగ్గి ప్రవహిస్తుంది. దీంతో మున్నేరు పై ఉన్న రెండు బ్రిడ్జ్ లపై నుండి రాకపోకలు పునరుద్ధరణ చేసారు. నిన్న 36 అడుగుల మేర ప్రవహించగా ప్రస్తుతం15 అడుగుల మేరకు వరద నీరు తగ్గింది. దీంతో ముంపు వాసులు ఊపిరిపీల్చుకున్నారు.

  • 11:08 AM

    Heavy Rain Alert in AP: అమరావతి: మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం వద్ద కరకట్టకు గండి 

    ==> భారీగా కరకట్ట కింద నుంచి  వెళుతున్న నీళ్లు నిలిచిపోయిన పనులు

    ==> నీట మునిగిన సీఎం చంద్రబాబు నివాసం 

    ==> మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం వద్ద గదుల్లో నుంచి తాడు సహాయంతో జనాలను కిందకు దింపుతున్న వైనం 

    ==> పూర్తిగా నీట మునిగిన సత్యనారాయణ రాజు ఆశ్రమం.

  • 11:00 AM

    Heavy Rain Alert in AP: వరద ప్రభావంతో ప్రభుత్వానికి ప్రకాశం బ్యారేజ్ రూపంలో మరొక దెబ్బ

    ==> ప్రకాశం బ్యారేజ్ కి చెందిన 69వ గేటు దెబ్బతిన్న వైనం..

    ==> ఏపీ టూరిజానికి సంబంధించిన బోట్లు వరద ప్రభావంతో కొట్టుకు వచ్చిన వైనం..

    ==> ఏపీ టూరిజం బోట్లు బలంగా 69వ నెంబర్ గేటుకు తాకటంతో దెబ్బతిన్న గేటు..

    ==> 69వ నెంబర్ గేటు పక్కన ఉన్న గేటు కూడా స్వల్పంగా దెబ్బతిన్న పరిస్థితి..

    ==> రంగంలోకి దిగిన అధికారులు.

    ==> ఏపీ టూరిజం బోట్లను ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద నుంచి తప్పించకపోతే మరో ప్రమాదం తప్పదు: నిపుణులు

    ==> రంగంలోకి దిగబోతున్న నిపుణుల బృందం..

    ==> 69వ నెంబరు గేటు గురించి వివరాలు అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..
      

Trending News