AP Inter Result 2024 Live: ఏపీ ఇంటర్‌ ఫలితాలు వచ్చేశాయి.. ఇలా చెక్ చేసుకోండి

AP Inter Result 1st &2nd Year 2024 Live: ఇంటర్ రిజల్ట్స్‌ ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా..? అని విద్యార్థులు ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నారు. ఈ నెల 12వ తేదీన ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉంది. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ bieap.apcfss.in, bie.ap.gov.inలో ఫలితాలు వెల్లడికానున్నాయి. ఇంటర్ ఫలితాల లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.  

Written by - Ashok Krindinti | Last Updated : Apr 12, 2024, 11:33 AM IST
AP Inter Result 2024 Live: ఏపీ ఇంటర్‌ ఫలితాలు వచ్చేశాయి.. ఇలా చెక్ చేసుకోండి
Live Blog

AP Inter Result 1st and 2nd Year 2024 Live Updates: ఇంటర్మీడియట్ ఫలితాల కోసం విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 12వ తేదీన రిజల్ట్స్‌ను విడుదల చేసేందుకు ఏపీ ఇంటర్మీడియట్ విద్యామండలి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫలితాలకు సంబంధించి అన్ని పనులు దాదాపు పూర్తయినట్లు సమాచారం. ఇందులో టెక్నికల్ సమస్యలు తలెత్తితే ఫలితాలు ఒకటి రెండు రోజులు ఆలస్యం అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇంటర్ పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగాయి. ఫస్టియర్, సెకండీయర్ పరీక్షలకు కలిపి 10 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్ రిజల్ట్స్‌తో పలు పోటీ పరీక్షలకు సంబంధం ఉండడంతో వీలైనంత త్వరగా ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలను రిలీజ్ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇంటర్ రిజల్ట్స్‌ లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.
 

12 April, 2024

  • 11:32 AM

    AP Inter Result 2024: ఇంటర్ ఫలితాలను విద్యార్థులు http://resultsbie.ap.gov.in/ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.

  • 11:28 AM

    AP Inter Result 2024: ఏపీ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలను మే 24 నుంచి జూన్ 1 మధ్య నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. త్వరలోనే పూర్తి షెడ్యూల్ వెల్లడిస్తామన్నారు.

  • 11:24 AM

    AP Inter Result 2024: ఇంటర్ ఫలితాల్లో మరోసారి బాలికల హవా కొనసాగింది. సెకండియర్లో అమ్మాయిలు 81 శాతం ఉత్తీర్ణత సాధించగా.. అబ్బాయిలు 75 శాతం మంది పాస్ అయ్యారు. ఫస్ట్ ఇయర్‌లో అమ్మాయిలు 71 శాతం, అబ్బాయిలు 64 శాతం మంది పాస్ అయ్యారు.

  • 11:12 AM

    AP Inter Result 2024: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను విడుదల చేశారు. 
     

  • 14:34 PM

    AP Inter Result 2024: రేపు ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు బోర్డు వెల్లడించింది. తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో కార్యదర్శి ఫలితాలను విడుదల చేస్తారని ప్రకటించింది. జనరల్తో పాటు ఒకేషనల్ కోర్సుల రిజల్ట్ విడుదల చేస్తామంది.

  • 16:01 PM

    AP Inter Result 2024: ఇంటర్ ఫలితాల కోసం విద్యార్థులు examsresults.ap.nic.inresults.bie.ap.gov.inresults.apcfss.inbie.ap.gov.inresults.gov.in వెబ్‌సైట్‌ను చెక్ చేస్తూ ఉండండి.
     

  • 11:14 AM

    AP Inter Result 2024: గతేడాది ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు దాదాపు 5.10 లక్షల మంది, సెకండియర్ పరీక్షలకు 3.7 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. మొదటి సంవత్సరంలో 61 శాతం మంది, రెండో సంవత్సరంలో 72 శాతం ఉత్తీర్ణత సాధించారు.

  • 10:38 AM

    AP Inter Result 1st and 2nd Year 2024 Live Updates: 

    ==> అధికారిక వెబ్‌సైట్ bieap.apcfss.in, bie.ap.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లండి.
    ==> ఇంటర్ ఫలితాల లింక్‌పై క్లిక్ చేయండి.
    ==> హాల్ టికెట్ నంబరును ఎంటర్‌ చేయండి.
    ==> మీ రిజల్ట్స్‌ చెక్ చేసుకుని.. భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ అవుట్ తీసుకోండి.

  • 09:03 AM

    AP Inter Result 1st and 2nd Year 2024 Live Updates: ఇంటర్ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్స్‌లో bieap.apcfss.in, bie.ap.gov.in లో చెక్ చేసుకోవచ్చు.
     

  • 08:53 AM

    AP Inter Result 1st and 2nd Year 2024 Live Updates: జవాబు పత్రాల మూల్యాంకనం అధికారులు పునఃపరిశీలన చేయనున్నారు. ఫలితాలను డిజిటల్‌గా నమోదు చేసి.. అనంతరం ఆన్‌లైన్‌ రిజల్ట్స్‌ను విడుదల చేయనున్నారు. 
     

Trending News