Kuppam Road Accident: వరుస రోడ్డు ప్రమాదాల కారణంగా రోడ్డు ఎక్కాలంటేనే చాలా మంది భయపడుతున్నారు. ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట ఘోర రోడ్డు ప్రమాదం జరుగుతూనే ఉంది. ఆ ప్రమాదంలో కుటుంబాలకి కుటుంబాలే మరణిస్తున్నాయి. అయితే అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఈ వరుస ప్రమాదాలను ఆపలేకపోతున్నారు. నిత్యం జరుగుతున్న ప్రమాదంలో కుటుంబాలకు కుటుంబాలే రోడ్డున పడుతున్నాయి. అంతేకాకుండా ఎంతో మంది వికలాంగులుగా మారుతున్నారు. అయితే తాజాగా కుప్పంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం అందరిని భయపెడుతోంది.
ఆంధ్ర ప్రదేశ్‌లోని కుప్పంలో జరిగి రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వైద్య విద్యార్థులు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదం ఈ రోజు తెల్లవారి జామున కుప్పం సెట్టిపల్లి పెట్రోల్ బంక్ వద్ద కారు భారీ స్పీడ్‌తో వచ్చి ఎదురుగా వస్తున్న లారీని ఒక్క సారిగా ఢీ కొట్టింది. దీంతో ఆ కారు నుజ్జునుజ్జుయ్యింది. అందులో ప్రయాణిస్తున్న పిఈఎస్ మెడికల్ కాలేజ్ విద్యార్థులు వికాస్, కళ్యాణ్, ప్రవీణ్‌లు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటన జరగడానికి కారణాలు అతి వేగమే కారణమని పోలీసు పేర్కొన్నారు.
ఈ రోడ్డు ప్రమాదం మరణించిన ముగ్గురు వైద్య విద్యార్థులు, గత కొద్ది రోజుల నుంచి పిఈఎస్ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నారని సమాచారం. పోలీసుల వివరాల ప్రకారం వీరిలో ఇద్దరు కడప జిల్లాకు, ఒకరు నెల్లూరు వాసిగా గుర్తించారు. పోస్టుమార్టం కోసం వీరి మృతదేహాలను ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. ఘటనపై సుధీర్ఘ దర్యాప్తు చేపడుతున్నారు.
అయితే ఈ ప్రమాద వార్తను తెలుసుకున్న మృతుల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. విధులకు వెళ్తి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో మృతుల స్వగ్రామాల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. అయితే ఈ ప్రమాదం జరగడాని ప్రధాన కారణాలు వారు ప్రయాణిస్తున్న కారు అతి వేగంగా ఉండడమేకాకుండా ఆ స్పీడ్‌లో కారు కంట్రోల్ తప్పడమేనని పోలుసులు తెలిపారు.
ఇలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీలు చాలా రకాల చర్యలు చేపడుతున్నారు. అయినప్పటికీ చాలా మంది రోడ్డు భద్రత నియమాలు పాటించకుండా అధిక వేగంతో దూసుకువెళ్తున్నారు. అంతేకాకుండా చాలా మంది మద్యం తాగి కూడా నడుపుతున్నారు. అయితే ఇలాంటి ప్రమాదలు జరగకుండా ఉండడానికి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా రోడ్డు భద్రత గురించి విస్తృత ప్రచారం చేయాలి.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Samantha Ruth Prabhu : నాకు అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ తోడున్నది అదే : సమంత
Also Read: Deepthi Sunaina : స్ట్రెస్ ఉంది.. అక్కడ చెమటలు పడుతున్నాయ్.. దీప్తి సునయన కామెంట్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook