Kodali Nani: సోఫాలో కుప్పకూలిపోయిన కొడాలి నాని.. ఓటమి భయంతో అస్వస్థత?

Kodali Nani Collapsed In His House: ఆంధ్రప్రదేశ్‌లో కీలక స్థానమైన గుడివాడ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ఈ స్థానం నుంచి మరోసారి కొడాలి నాని గెలుస్తాడా లేదా అనే చర్చ జరుగుతోంది. ఈ సమయంలో నాని అస్వస్థతకు గురవడం కలకలం రేపింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : May 23, 2024, 06:55 PM IST
Kodali Nani: సోఫాలో కుప్పకూలిపోయిన కొడాలి నాని.. ఓటమి భయంతో అస్వస్థత?

Kodali Nani Collapse: ఆంధ్రప్రదేశ్‌లో కీలక నాయకుడు.. మాజీ మంత్రి కొడాలి నాని అస్వస్థతకు గురయ్యాడు. పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారిగా కూలబడిపోయారు. ఏం జరిగిందో తెలియక కంగారుపడిన కుటుంబసభ్యులు, పార్టీ నాయకులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన ఆకస్మికంగా అనారోగ్యానికి గురవడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల సరళి పరిశీలిస్తే ఎమ్మెల్యేగా నాని ఓడిపోతారని తెలుసినట్టు సమాచారం. ఈ బెంగతోనే నాని అస్వస్థతకు గురయ్యినట్లు చర్చ జరుగుతోంది.

Also Read: Pinnelli Anticipatory Bail: ఎమ్మెల్యే పిన్నెల్లి సంచలన నిర్ణయం.. అరెస్ట్‌ కాకుండా కోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌

 

గుడివాడలోని తన స్వగృహంలో గురువారం నందివాడ మండలం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులతో కొడాలి నాని సమీక్ష నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పోలింగ్‌ పరిస్థితిని నాయకులను ఆరా తీశారు. మాట్లాడుతున్న క్రమంలో ఒక్కసారిగా నాని సోఫాలో కుప్పకూలిపోయారు. ఏం జరిగిందో తెలియని పరిస్థితుల్లో వెంటనే ఆయన అనుచరులు, కుటుంబీకులు అప్రమత్తమై ప్రథమ చికిత్స నిర్వహించారు. అనంతరం కార్యకర్తలు, నాయకులను అందరినీ బయటకు పంపించారు. వైద్యులకు ఫోన్లు చేసి ఇంట్లోనే వైద్యులు సెలైన్‌ బాటిళ్లు ఎక్కిస్తున్నారు. కొన్ని నెలల కిందట అనారోగ్యానికి గురయిన నాని మళ్లీ అస్వస్థతకు గురవడం కుటుంబసభ్యులను ఆందోళనకు గురి చేస్తుంది.

Also Read: Election Counting: ఆంధ్రప్రదేశ్‌ ఓట్ల లెక్కింపుపై ఈసీ దృష్టి.. మళ్లీ హింస చెలరేగకుండా పటిష్ట చర్యలు

 

అయితే నాని ఆరోగ్యాన్ని పరిశీలించిన అనంతరం వైద్యులు కుటుంబసభ్యులు, అనుచరులకు ముఖ్యమైన సూచనలు చేశారు. అతిగా ఆలోచించడం వలన అనారోగ్యానికి గురవుతున్నారని వైద్యులు తెలిపారు. వీలైనంత ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అయితే నాని తన ఎన్నికపైనే తీవ్రంగా మదనపడుతున్నారని తెలుస్తోంది. ఎన్నికల్లో పడిన ఓట్లు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నాయని.. కూటమి అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నట్లు పలు నివేదికల్లో వెల్లడైనట్లు సమాచారం. ఇది తెలుసుకున్న నాని అప్పటి నుంచి ఆందోళన చెందుతున్నట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News