పొత్తుల విషయంలో జనసేన వైఖరి బయటపెట్టిన నాదెండ్ల మనోహర్; ఇది వ్యక్తిగతమా లేదా పార్టీ నిర్ణయమా ?

పొత్తుల విషయంలో జనసేన వైఖరి బయటపెట్టిన నాదెండ్ల మనోహర్; ఇది వ్యక్తిగతమా లేదా పార్టీ నిర్ణయమా ?

Last Updated : Dec 28, 2018, 04:16 PM IST
పొత్తుల విషయంలో జనసేన వైఖరి బయటపెట్టిన నాదెండ్ల మనోహర్; ఇది వ్యక్తిగతమా లేదా పార్టీ నిర్ణయమా ?

విజయనగరం: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ పొత్తులు - ఎత్తుల ఎలా ఉంటాయన్న దానిపై ఇప్పటి నుంచి జోరుగా చర్చనడుస్తున్న నేపథ్యంలో ఈ అంశంపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ స్పందించింది. ఈ సందర్భంగా పొత్తల విషయంలో జనసేన వైఖరిని బయటపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని..ఎవరితోనూ పొత్తులండవని తేల్చి చెప్పారు.

అలాగే సీట్ల విషయంలోనూ క్లారిటీ ఇచ్చారు... ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఒంటిరిగా పోటీ చేస్తుందని ప్రకటించారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని విపక్ష వైసీపీ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎన్నికల్లో పొత్తు, సీట్ల విషయంలో జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఇలా స్పందించారు.

పార్టీ సమీక్ష సమావేశంలో ప్రకటన
విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలోని లోకబంధు రెసిడెన్సీలో బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాలకు చెందిన జనసేన నాయకులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ... టీడీపీ, వైసీపీలు స్వార్థ ప్రయోజనాలకోసం జనసేనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. కొందరు జనసేన - వైపీపీ పొత్తు అని..మరికొందరు బీజేపీ-జనసేన పొత్తు అని.. మరికొందరు వైసీపీ-బీజేపీ-జనసేన పొత్తు అని ఎవరికి తోచిన రీతిలో వారు ప్రచారం చేస్తున్నారు...ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు..వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తుపెట్టబోమని ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ తెల్చిచెప్పారు. 

 ఇది వ్యక్తిగతమా లేదా పార్టీ నిర్ణయమా ?
పొత్తులు, పోటీ చేసే స్థానాల విషయంలో ఇప్పటి వరకు పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ ప్రకటించలేదు. పార్టీ కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ నేపథ్యంలో  ఈ అంశంపై నాదెండ్ల స్పందించడంపై చర్చకు దారి తీస్తోంది. ఇది నాదెండ్ల వ్యక్తిగత అభిప్రాయమా ? లేందంటే పార్టీ అభిప్రాయమా అనే దానిపై చర్చ జరుగుతుంది. పార్టీ సమీక్షా సమావేశంలో ఈ ప్రకటన చేశారంటే ఇది ముమ్మటికి పార్టీ అభిప్రాయంగానే పరిగణించాల్సి ఉందని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒక వేళ నాదెండ్ల వ్యక్తిగత అభిప్రాయం తెలిపినా అది వాస్తవ రూపం దాల్చతుందని మరికొందరి వాదన.. పార్టీలో నెంబర్ టూ స్థాయిలో ఉన్న నాదెండ్ల మనోహర్ మాటకు చాలా విలువ ఉంది. నాదెండ్ల అభిప్రాయాలు, సూచనలను పవన్ తప్పకుండా పాటిస్తారు...ఒక వేళ నాదెండ్ల చేసిన వ్యాఖ్యాలు వ్యక్తిగతమైనప్పటికీ  ఇది వాస్తవ రూపం దాల్చే అవకాశాలు ఎక్కువని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు

Trending News