Janasena Glass Symbol: జనసేనకు గుడ్‌న్యూస్.. గాజు గ్లాస్ గుర్తు వచ్చేసింది

Election Commission Allotting Glass Symbol To Janasena: జనసేనకు ఎన్నికల సంఘం తీపి కబురు చెప్పింది. గాజు గ్లాసును తిరిగి జనసేనకే కేటాయించింది. ఈ మేరకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశారు.

Written by - Ashok Krindinti | Last Updated : Sep 19, 2023, 02:00 PM IST
Janasena Glass Symbol: జనసేనకు గుడ్‌న్యూస్.. గాజు గ్లాస్ గుర్తు వచ్చేసింది

Election Commission Allotting Glass Symbol To Janasena: జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి గ్లాస్ గుర్తును కేటాయించింది. ఈ మేరకు ఎన్నికల సంఘానికి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. "జనసేన పార్టీకి ఎన్నికల గుర్తుగా మరోసారి గ్లాస్‌ను కేటాయించినందుకు ఎన్నికల సంఘానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు జరిగిన గత సార్వత్రిక ఎన్నికలలో జనసేన అభ్యర్థులు గ్లాస్‌ గుర్తుపైనే పోటీ చేసిన సంగతి విదితమే. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 137 స్థానాలు, తెలంగాణ నుంచి 7 లోక్‌ సభ స్థానాలలో జనసేన అభ్యర్థులు నాడు పోటీలో నిలిచారు. 

ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ లలో ప్రజలకు సేవ చేయడానికి జనసేన అభ్యర్థులు సన్నద్ధమైన తరుణంలో రిజిస్టర్డ్‌ పార్టీ అయిన జనసేనకు గ్లాస్‌ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించడం చాలా సంతోషదాయకం. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాలు, కేంద్ర ఎన్నికల సంఘంలోని అధికారులు, సిబ్బందికి పేరుపేరునా నా తరఫున, జనసేన పార్టీ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాను.." అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.

మే నెలలో కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును తొలగించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీల వివరాలను ప్రకటించిన సందర్భంలో జనసేన గ్లాస్ గుర్తును కోల్పోయింది. అప్పుడు గాజు గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్ చేసింది. గాజు గ్లాసుకు జనాల్లో మంచి క్రేజ్ ఉంది. గాజు గ్లాసు చూస్తే.. జనసేన పార్టీ గుర్తుకు వచ్చేంతగా ప్రజల్లోకి వెళ్లిపోయింది. అయితే ఎన్నికల సంఘం తొలగించిన తరువాత జనసైనికులు నిరాశ చెందారు. తాజాగా మళ్లీ అదే గుర్తును తమ పార్టీకి కేటాయించడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ఇక వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. బీజేపీ విషయం ఇంకా తేలాల్సి ఉంది. ఏపీలో టీడీపీతో కలిసి వెళతామని చెప్పిన పవన్ కళ్యాణ్‌.. తెలంగాణలో పరిస్థితిని బట్టి ముందుకు వెళతామన్నారు. దీంతో రెండు రాష్ట్రాల్లో జనసేన పార్టీ పోటీ ఖాయమైంది. త్వరలోనే పవన్ కళ్యాణ్‌ వారాహి యాత్రను తిరిగి ప్రారంభించనున్నారు. 

Also Read: World Cup 2023: ప్రపంచకప్‌కు ముందు వన్డేల్లో నెం.1గా నిలిచేదెవరు..? లెక్కలు ఇలా..!  

Also Read: Vijay Antony Daughter: హీరో విజయ్ ఆంటోని ఇంట్లో తీవ్ర విషాదం.. ఉరి వేసుకుని కూతురు ఆత్మహత్య  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News