విశాఖపై ఐటీ గురి ; ఆందోళనలో బడాబాబులు

                

Last Updated : Oct 25, 2018, 09:29 AM IST
విశాఖపై ఐటీ గురి ; ఆందోళనలో బడాబాబులు

విశాఖ:  ఆదాయపున్ను శాఖ ఇప్పుడు విశాఖపై ఐటీ గురిపెట్టింది. బుధవారం రాత్రి వివిధ రాష్ట్రాలకు చెందిన ఐటీ అధికారులు పలు హోటళ్లలో బస చేసిన విషయం బయటికి పొక్కింది. ప్రముఖ మీడియా కథనం ప్రకారం నగరంలోని ఓ హోటల్ లో బసచేసేందుకు వచ్చిన వారి ఐటీ కార్డులు చూపించాలని సిబ్బంది కోరడంతో విషయం బయటికి వచ్చింది . కాగా ఐటి అధికారులు గురువారం బృందాలు విడిపోయి దాడులు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని ఐటీ అధికారులు సైతం ఖండించకపోవడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది.

సముద్ర ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్న సంస్థలు, నిర్మాణపనులు చేస్తున్న కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ సంస్థలు  తదితర రంగాలకు చెందిన వారినే లక్ష్యంగా దాడులు జరగవచ్చని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయా రంగాలకు చెందిన వ్యాపారవేత్తలు ఆందోళన చెందుతున్నారు.

ఇటీవలె ప్రముఖ వ్యాపార వేత్త , టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ నివాసంలో ఐటీ దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వివిధ వ్యాపారాలతో సంబంధమున్న రాజకీయ నేతలే టార్గెట్ చేసుకొని దాడులు నిర్వహించే అవకాశముందని మరో రకంగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ నేతలు ఆందోళన చెందుతున్నారు. రాజకీయ కక్షతోనే ఐటీ దాడులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి

Trending News