Heavy Rains Alert: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాల హెచ్చరిక జారీ అయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారనుంది. ఫలితంగా మరో నాలుగు రోజుల్లో తెలంగాణ, ఏపీల్లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ సూచించింది.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో గత 24 గంటల్నించి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. మరో 48 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి ఆనుకుని ఆవర్తనం కొనసాగనుంది. ఫలితంగా వచ్చే 48 గంటల్లో వాతావరణం పూర్తిగా మారిపోనుంది. అల్పపీడనం కారణంగా నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడనుండటంతో రైతులు, కూలీలు గొర్రె కాపరులు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ వెల్లడించింది. వచ్చే నాలుగు రోజులు ఏయే జిల్లాల్లో వాతావరణం ఎలా ఉంటుందో వివరించింది.
రేపు బుధవారం నాడు అల్లూరి సీతారామరాజు, బాపట్ల, ప్రకాశం, గుంటూరు, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడవచ్చు. ఇక గురువారం నాడు కాకినాడ, గుంటూరు, పల్నాడు, ఏలూరు, బాపట్ల, తూర్పు గోదావరి, అనకాపల్లి, శ్రీకాకుళం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చు.
ఇక నంద్యాల, బాపట్ల, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో శుక్రవారం మోస్తరు వర్షాలు పడనున్నాయి. నంద్యాల, కర్నూలు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావవరి, శ్రీకాకుం, పార్వతీపురం మన్యం, కాకినాడ, ఏలూరు, కృష్ణా ఎన్టీఆర్, గుంటూరు, నెల్లూరు, కోనసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి.
మరోవైపు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కూడా భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ వెల్లడించింది ఇప్పటికే ఈ దిశగా రెడ్ అలర్ట్ జారీ అయింది. రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి నాలుగైదురోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. అల్పపీడనం కారణంగా ఉపరితల ఆవర్తనంతో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి.
Also read: Jagan Anna Thodu Scheme: వరుసగా నాలుగో ఏడాదిలో జగనన్న తోడు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook