Telangana Rain Alert: ఉత్తర తెలంగాణలో మళ్లీ కుండపోత.. 10 గంటల్లోనే 250 మిల్లిమీటర్ల వర్షం.. గోదావరి ఉగ్రరూపం

Telangana Rain Alert: తెలంగాణపై వరుణుడి పంజా కొనసాగుతోంది. వారం రోజులైనా సూర్యుడు జాడే లేకుండా పోయాడు. జోరు వానలతో తెలంగాణ మొత్తం తడిసి ముద్దవుతోంది. కుంభవృష్టిగా కురుస్తున్న వర్షాలతో పలు జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది.

Written by - Srisailam | Last Updated : Jul 13, 2022, 10:43 AM IST
  • ఉత్తర తెలంగాణలో మళ్లీ కుండపోత
  • మరో రెండు రోజులు రెడ్ అలెర్ట్
  • గోదావరిలో కొనసాగుతున్న వరద
Telangana Rain Alert: ఉత్తర తెలంగాణలో మళ్లీ కుండపోత.. 10 గంటల్లోనే 250 మిల్లిమీటర్ల వర్షం.. గోదావరి ఉగ్రరూపం

Telangana Rain Alert: తెలంగాణపై వరుణుడి పంజా కొనసాగుతోంది. వారం రోజులైనా సూర్యుడు జాడే లేకుండా పోయాడు. జోరు వానలతో తెలంగాణ మొత్తం తడిసి ముద్దవుతోంది. కుంభవృష్టిగా కురుస్తున్న వర్షాలతో పలు జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది.ఐఎండీ రెడ్ అలెర్ట్ జారీ చేసిన ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో మంగళవారం కుండపోతగా వర్షాలు కురిశాయి. జగిత్యాల, ఆదిలాబాద్, నిర్మల్ , పెద్దపల్లి, నిజామాబాద్ జిల్లాలో అత్యంత భారీ వర్షం కురిసింది.

మంగళవారం ఉదయం  నుంచి బుధవారం ఉదయం ఏడు గంటల వరకు అత్యధికంగా కొమరం భీమ్ జిల్లా జైనూరులో రికార్డ్ స్థాయిలో 39 సెంటిమీటర్ల వర్షం కురిసింది. కెరిమెరిలో 38, సిర్పూరులో 35 సెంటిమీటర్ల వర్షం కురిసింది.ఆదిలాబాద్ జిల్లా పిప్పలాద్రిలో అత్యధికంగా 300 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. సిరికొండలో 288, కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం అర్నకొండలో 286, నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చందాలో 267, అసిఫాబాద్ జిల్లా జైనూరులో 252, సిర్పూరులో 248, కరీంనగర్ జిల్లా గుండిలో 240, జగిత్యాల జిల్లా గుల్లకోటలో 239, కోరుట్లలో 228, పెద్దపల్లి జిల్లా ధర్మారంలో 225, మంచిర్యాల జిల్లా వెల్గనూరులో 225, నిజామాబాద్ జిల్లా మండోరలో 224 మిల్లిమీటర్ల అతి భారీ వర్షం కురిసింది. నిర్మల్ జిల్లా దిల్వాపూర్ లో 23, ములుగు జిల్లా వెంకటాపురంలో 22 సెంటిమీటర్ల వర్షం కురిసింది.

మంగళవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ఏకంగా 19 ప్రాంతాల్లో 20 సెంటిమీటర్ల కంటే ఎక్కువ వర్షం కురిసింది. 118 ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షం కురిసింది. 88 ప్రాంతాల్లో అతి భారీ వర్షం కురవగా.. 371 ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా రెండు, మూడు గంటల్లోనే 10 నుంచి 15 సెంటిమీటర్ల వర్షం కురిసింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెరువులు, కుంటలు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి.

తెలంగాణకు మరో రెండు రోజుల భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలకు రెడ్ అలెర్జ్ జారీ చేసింది. ఉత్తర తెలంగాణలోని మిగితా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ఇచ్చింది. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లోనూ అక్కడక్కడ అత్యంత భారీ వర్షం కురుస్తుందని వెల్లడించింది.

Read also: TELANGANA EAMCET 2022: తెలంగాణకు మరో రెండు రోజులు రెడ్ అలెర్ట్.. రేపటి నుంచి జరగాల్సిన ఎంసెట్ వాయిదా!

Read also: Revanth Reddy: కమలంలో రేవంత్ రెడ్డి కలకలం.. గజ్వేల్ లో ఈటల పోటీ చేసేది బీజేపీ నుంచి కాదా?

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News