రానున్న 2 రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు

రానున్న 2 రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు

Last Updated : Aug 17, 2019, 04:31 PM IST
రానున్న 2 రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు

విశాఖ: నైరుతి, పశ్చిమ దిశ నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో రాగల 48 గంటల్లో కోస్తాంధ్రలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తాంధ్రలో అక్కడక్కడా ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 

ANI photo of Bhakra dam

ఇదిలావుంటే ఉత్తరాంధ్రలోనూ రాగల రెండు, మూడు రోజులపాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. పంజాబ్‌లో హై అలర్ట్ జారీ చేసిన అధికారులు.. హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీచేశారు. ఇప్పటికే వరద నీటితో భాక్రా డ్యామ్ నిండుకుండలా మారుతుండటంతో వరద నీటిని దిగువకు వదిలేందుకు అక్కడి అధికారులు నాలుగు ఫ్లడ్ గేట్స్ తెరిచారు. భాక్రా డ్యామ్ పూర్తి కెపాసిటీ 1682 అడుగులు కాగా ఇప్పటికే 1674 అడుగుల మేరకు నీరు వచ్చిచేరింది. ఈ కారణంగానే ఫ్లడ్ గేట్స్ తెరవాల్సి వచ్చిందని భాక్రా బియాస్ మేనేజ్‌మెంట్ బోర్డ్ (బీబీఎంబి) వెల్లడించింది.

Trending News