Heavy Rains In Two Telugu States: బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం… ఎల్లుండి ఒడిశా, బెంగాల్ తీరంలో వాయుగుండంగా మారే అవకాశాలున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేఛాన్స్ వుందని వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీకాకుళం, మన్యం , అల్లూరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం వుందని హెచ్చరించింది. కాగా రాత్రి ఎన్టీఆర్ జిల్లాలో జోరు వాన కువడంతో వరద సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో అలర్ట్ అయిన అధికారులు నదీ తీర ప్రాంతాలు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. అంతేకాదు వాగులు, వంకల సమీపంలో ఉండే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.
మరోవైపు తెలంగాణకు కూడా మళ్లీ వరుణ గండం పొంచి ఉంది. రాష్ట్రంలో ఈరోజు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. రాగల మూడు రోజులు చాలా జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీస్తాయని తెలిపింది.
మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా వానలు విస్తారంగా కురుస్తాయని వెల్లడించింది. దీనికి అనుబంధ ఆవర్తనం కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది. ఇది ఉత్తర దిశగా కదులుతూ బలపడి ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలోని వాయువ్య బంగాళాఖాతం వద్ద రేపు వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తరువాత ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ వచ్చే మూడు రోజులలో గంగేటిక్ పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, ఝార్ఖండ్ పరిసర ఉత్తర ఛత్తీస్‌గఢ్ మీదుగా కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. ఈ రోజు కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోనూ అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్డ్ జారీ చేసింది.
ఇదీ చదవండి: పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడానికి కారణమేమిటంటే..!
ఇదీ చదవండి: పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.