Social Media Activists Arrests: తన భర్త ఏం తప్పు చేశాడని వేధిస్తున్నారు అని వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్ భార్య ఇంటూరి సుజన ప్రశ్నించారు. రెండున్నర నెలలుగా తన భర్తను పోలీసులు వేధిస్తున్నారని వాపోయింది. 'నా భర్తపై ఇప్పటివరకు 15 కేసులు పెట్టారు. ఇంకా పెడుతూనే ఉన్నారు. అసలు ఆయన చేసిన తప్పేమిటి?' అని నిలదీశారు. కూటమి ప్రభుత్వం మా కుటుంబాన్ని దారుణంగా ఇబ్బందులు పెడుతోందని.. వేధింపులు ఆపకపోతే తనకు చావే శరణ్యమని చెప్పి సుజన కన్నీటి పర్యంతమయ్యారు.
ఇది చదవండి: Assembly Session: అసెంబ్లీలో వైఎస్ జగన్ అడుగుపెట్టకుండానే ముగిసిన సభా సమరం
తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో శుక్రవారం ఇంటూరి రవి కిరణ్ సతీమణి సుజన మీడియాతో మాట్లాడుతూ తన భర్తపై జరుగుతున్న వేధింపులు.. కేసుల వివరాలను ఆమె వివరించారు. 'నా భర్తను ఆగస్టు 31వ తేదీన అదుపులోకి తీసుకున్న పోలీసులు రెండున్నర నెలలుగా రాష్ట్రమంతా తిప్పుతున్నారు. 'నా భర్త ఏం తప్పు చేశాడని ఇలా వేధిస్తున్నారు? వివిధ పోలీస్ స్టేషన్లు, జైళ్లకు తరలిస్తున్నారు. కస్టడీలో ఉన్నా.. ఇంటికి వచ్చి నోటీసులు అంటించారు' అని వాపోయారు.
ఇది చదవండి: Adani Bribe: పురందేశ్వరి సంచలన ట్వీట్.. అదానీతో వైఎస్ జగన్ లంచం తీసుకున్నాడు
'నా భర్తను తీసుకెళ్తున్న పోలీసులతో నేను ఫాలో అయ్యే ప్రయత్నం చేస్తుంటే మా కారులో గంజాయి పెట్టి సీజ్ చేయాలని ప్రయత్నించారు' అని సుజన ఆరోపించారు. రిమాండ్‌లో ఉన్నారని తెలిసి కూడా పులివెందుల పీఎస్ నుంచి పోలీసులు వచ్చి మా ఇంటి గోడకు నోటీసులు అంటించారు. నా భర్త హార్ట్ పేషెంట్. ఆయనకు ఏం మందులు ఇస్తున్నారో కూడా తెలియడం లేదు' అని కన్నీటి పర్యంతమయ్యారు. 'ఏ జైల్లో ఉన్నాడో తెలుసుకుని అక్కడికి వెళితే అక్కడ కలవనీయకుండా పీటీ వారెంట్‌ల పేరుతో ఇంకో చోటకు తరలిస్తున్నారు' అని సుజన వివరించారు.
'మా లాయర్లకు కూడా పూర్తి సమాచారం ఇవ్వడం లేదు. నా భర్త ఆరోగ్యం బాగోలేదు. అయినా ఆయన్ను కనీసం చూడనివ్వడం లేదు. అర్ధరాత్రిళ్లు తరలిస్తున్నారు' అని సుజన ఆరోపించారు. '12 ఏళ్ల నుంచి మేం వైఎస్సార్‌సీపీలో పనిచేస్తున్నాం. నా భర్త ఏ తప్పూ చేయలేదు' అని స్పష్టం చేశారు. 'నా భర్తను, మా కుటుంబాన్ని ఇలాగే వేధిస్తే నేను చంద్రబాబు ఇంటి ముందు నా పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంటా' అని సుజన హెచ్చరించారు.
ఇంటూరి రవికిరణ్‌పై తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్న కూటమి ప్రభుత్వం.
వరుస కేసులు పెడుతూ రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లన్నీ తిప్పుతూ, కోర్టులన్నీ తిప్పుతూ కక్షసాధింపు చేస్తున్న పోలీసులు.
ఏ తప్పు చేసామని ఇలా వేధిస్తున్నారని వాపోయిన ఇంటూరి సతీమణి సుజన.
ఈ ప్రభుత్వ వేధింపులు ఇలాగే… pic.twitter.com/4DVKniUV7g— YSR Congress Party (@YSRCParty) November 22, 2024
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter