YSR Rythu Bharosa Scheme: మనీ ఖాతాల్లోకి రాలేదా.. అయితే ఇలా చేయండి

YSR Rythu Bharosa Scheme Status: వైఎస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ 3వ విడత నిధులు, నివర్ తుపాను పంట నష్టానికి సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ చెల్లింపులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు.

Last Updated : Dec 30, 2020, 02:31 PM IST
  • దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు ఖాతాల్లోకి రూ.13,500 జమ
  • మొత్తం రూ.1,766 కోట్లను ఏపీ సీఎం వైఎస్ జగన్ రైతుల ఖాతాల్లోకి జమ
  • రాష్ట్ర రైతులు వైఎస్సార్ రైతు భరోసా నగదు స్టేటస్ ఇలా చూసుకోండి
YSR Rythu Bharosa Scheme: మనీ ఖాతాల్లోకి రాలేదా.. అయితే ఇలా చేయండి

YSR Rythu Bharosa Scheme Status: వైఎస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ 3వ విడత నిధులు, నివర్ తుపాను పంట నష్టానికి సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ చెల్లింపులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. మంగళవారం నాడు వైఎస్సార్ రైతు భరోసా కింద రూ.1,120 కోట్లు విడుదల చేశారు. దాంతో పాటు నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ కింద రూ.646 కోట్ల నిధులను విడుదల చేశారు. 

మంగళవారం నాడు మొత్తం రూ.1,766 కోట్లను ఏపీ సీఎం వైఎస్ జగన్(YS Jagan Mohan Reddy) రైతుల ఖాతాల్లోకి జమ చేస్తూ ఆన్‌లైన్ చెల్లింపులు జరిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు ఖాతాల్లోకి రూ.13,500 ఇస్తున్నామని చెప్పారు. వైఎస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం కింద మొత్తం రూ.13,101 కోట్లు రైతులకు అందించినట్లు తెలిపారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ రైతులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Also Read: PM Kisan Scheme: రైతుల ఖాతాల్లోకి రూ.2000 జమ.. వివరాలు ఇలా చెక్ చేసుకోండి

కాగా, వైఎస్సార్ రైతు భరోసా పథకం(YSR Rythu Bharosa Scheme) నగదు ఖాతాలో చేరిందో తెలుసుకునేందుకు కొందరు రైతులు ఇబ్బంది పడుతున్నారు. దీనికి సంబంధించి ఏ సమస్య వచ్చినా టోల్ ఫ్రీ నెంబర్ 155251కు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. మీ సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చు. మరోవైపు ప్రభుత్వం రూపొందించిన వైఎస్సార్ రైతు భరోసా వెబ్‌సైట్ (YSR Rythu Bharosa Website)‌ లో రైతులు తమ ఖాతాల్లో నగదు స్టేటస్ వివరాలు తెలుసుకునే సదుపాయం ఉంది.
Also Read: Gold Price Today: దిగొచ్చిన బంగారం ధరలు.. వెండి పైపైకి!

వైఎస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ యోజన పథకం కింద లబ్దిదారులు మీ వివరాలు ఎంటర్ చేసి లాగిన్ అయ్యి స్టేటస్ వివరాలు తెలుసుకోండి.
https://ysrrythubharosa.ap.gov.in/RBApp/RB/Login 

రాజకీయాలు, క్రీడలు, వినోదం, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G  

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News