రాష్ట్రంలో మొబైల్ విడిభాగాల తయారీ పరిశ్రమ..ఏపీ సర్కార్ తో 'హోలీటెక్' కీలక ఒప్పందం

                                      

Last Updated : Aug 6, 2018, 10:38 PM IST
రాష్ట్రంలో మొబైల్ విడిభాగాల తయారీ పరిశ్రమ..ఏపీ సర్కార్ తో 'హోలీటెక్' కీలక ఒప్పందం

ఆంధ్రప్రదేశ్‌లో మరో పెద్ద కంపెనీ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ఈ రోజు మొబైల్ విడిబాగాలను తయారుచేసే ప్రముఖ చైనా కంపెనీ 'హోలీటెక్‌'తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.  ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేశ్‌ సమక్షంలో కంపెనీ ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. పరిశ్రమ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం తిరుపతిలో 75 ఎకరాలు కేటాయించింది. కాగా వచ్చే ఏడాది మార్చి నుంచి ఉత్పత్తి ప్రారంభించాలని హోలిటెక్ సంస్థ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పరిశ్రమ ఏర్పాటు పనులు యుద్ధప్రాతిపదికిన చేపట్టనున్నారు. ఇప్పటికే ఫోన్ల తయారీ కంపెనీలకు నెలవైన చిత్తూరు జిల్లా(చంద్రబాబు సొంత జిల్లా)లో మరో కొత్త పరిశ్రమ ఏర్పాటు చేస్తుండటం గమనార్హం.

ఒప్పందంలోని ప్రధాన అంశాలు: 
* రాష్ట్రంలో హోలీటెక్‌ సంస్థ రూ.1400 కోట్ల  పెట్టుబడి
* ప్రతీ నెలా 5 కోట్ల మొబైల్ విడిభాగాలు ఉత్పత్తి లక్ష్యం
* పరిశ్రమ ఏర్పాటు కోసం 75 ఎకరాలు కేటాయింపు
* 2019 మార్చి నుంచి ఉత్పత్రి ప్రారంభించాలని నిర్ణయం
* పరిశ్రమ ఏర్పాటుతో 6 వేల మందికి ఉపాధి అవకాశాలు

ఎలక్ట్రానికి హబ్ గా ఏపీ - నారా లోకేష్
ఈ సందర్భంగా ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఏపీని ఎలక్రానిక్ హబ్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఇందుకు హోలీటెల్ సంస్థ ఏర్పాటు నాంది అని వ్యాఖ్యానించారు. దేశంలో తయారయ్యే మొబైల్ ఫోన్లలో 29 శాతం మన రాష్ట్రంలో తయారవుతున్నాయని వెల్లడించారు. 240 బిలియన్ డాలర్ల ఎలక్ట్రానిక్ వస్తువులు ఏపీ నుంచే ఉత్పత్తి కావాలన్నది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని... ఆ దిశగా ప్రణాళికతో ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా ఐటీ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.

Trending News