Heavy Rains Effect Friday Holiday: చలికాలంలో వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఉష్ణోగ్రతలు అమాంతం క్షీణిస్తుండడంతో వర్షం ముప్పు కూడా పొంచి ఉంది. ఇప్పటికే వర్షాలతో కొన్ని జిల్లాలు తీవ్రంగా ప్రభావం చూపగా.. మరికొన్ని కొంత ప్రభావం ఎదుర్కొన్నాయి. తాజాగా మరోసారి వాతావరణం భయానకంగా మారింది. మరికొన్ని జిల్లాల్లో కూడా వర్షం ప్రమాదం పొంచి ఉందని వాతావరణ శాఖ వెల్లడించడంతో ప్రభుత్వం సెలవు ప్రకటించింది. విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ముందు జాగ్రత్త చర్యగా విద్యాలయాలకు సెలవు ప్రకటిస్తూ అధికారులు ప్రకటన జారీ చేశారు. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం.
వరుసగా వర్షం వచ్చే సూచనలు వాతావరణ శాఖ చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ సందర్భంగా ఈనెల 13వ తేదీన అంటే శుక్రవారం విద్యాలయాలకు సెలవు ప్రకటిస్తూ స్వయంగా మంత్రి తెలిపాడు. జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో డిసెంబర్ 13వ తేది తిరుపతి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, జూనియర్ కళాశాలలు, అంగన్వాడి కేంద్రాలకు సెలవు ఇస్తూ జిల్లా ఇంఛార్జి కలెక్టర్ శుభం బన్సల్ ప్రకటించారు.
తిరుపతి జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో డిసెంబర్ 13వ తేది శుక్రవారం తిరుపతి జిల్లా లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, జూనియర్ కళాశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటిస్తున్నట్లు ఇంఛార్జి జిల్లా కలెక్టర్ శుభం బన్సల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు, విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వర్షం.. వరద ముప్పు పొంచి ఉండడంతో తిరుపతి జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు, జూనియర్ కళాశాలల కు ఎయిడెడ్ యాజమాన్యాల కింద నిర్వహిస్తున్న అన్ని పాఠశాలలకు, జూనియర్ కళాశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు డిసెంబర్ 13వ తేదీన ప్రభుత్వ సెలవు ప్రకటించింది. ఈ ఉత్తర్వులను సంబంధిత యాజమాన్యాలన్నీ విధిగా పాటించాలని ఇన్‌ఛార్జి కలెక్టర్ శుభ్రం ఓ ప్రకటనలో తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.