పుల్వామా తరహా దాడులకు కుట్ర.. ఏపీ సహా ఏడు రాష్ట్రాల్లో హై అలర్ట్

ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌తోపాటు దేశవ్యాప్తంగా ఉన్న ఏడు రాష్ట్రాల్లో పుల్వామా తరహా దాడులకు పాల్పడేందుకు పాకిస్తాన్‌కి చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ కుట్ర పన్నిందని నిఘావర్గాల హెచ్చరించాయి.

Last Updated : Aug 8, 2019, 02:48 PM IST
పుల్వామా తరహా దాడులకు కుట్ర.. ఏపీ సహా ఏడు రాష్ట్రాల్లో హై అలర్ట్

న్యూఢిల్లీ: 370 ఆర్టికల్ రద్దు నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌తోపాటు దేశవ్యాప్తంగా ఉన్న ఏడు రాష్ట్రాల్లో పుల్వామా తరహా దాడులకు పాల్పడేందుకు పాకిస్తాన్‌కి చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ కుట్ర పన్నిందని నిఘావర్గాల హెచ్చరించాయి. నిఘావర్గాల హెచ్చరికల నేపథ్యంలో కశ్మీర్ లోయతోపాటు ఏడు రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. ఢిల్లీ, రాజస్తాన్, పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇండియన్ ఆర్మీ, పోలీసులు, ఇతర భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ దాడులకు పాల్పడే అవకాశాలున్నాయని నిఘావర్గాలు హెచ్చరించాయి. పాకిస్తాన్ ఇంటెలీజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ సహకారంతోనే జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఈ దాడులకు పాల్పడనుందని నిఘావర్గాలు అనుమానం వ్యక్తంచేశాయి. 

ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకుని జరిగే ఉగ్రవాద దాడులను సైతం నివారించేందుకు అన్ని విమానాశ్రయాలను కేంద్రం అప్రమత్తం చేసింది. అందులో భాగంగానే ఆగస్టు 10 నుంచి 20వ తేదీ వరకు విమానాశ్రయాల్లో సందర్శకులకు ప్రవేశం లేకుండా కఠినచర్యలు తీసుకోనున్నారు. ప్రయాణికులను సైతం కట్టుదిట్టమైన భద్రత మధ్య తనిఖీలు చేసిన అనంతరమే వారిని విమానాశ్రయాల్లోకి అనుమతించనున్నారు.

Trending News