టీడీపీ Vs వైసీపీ: పైకి గెలుపుపై ధీమా ..లోలోపల ఓటమి భయం..ఎందుకిలా ?

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది

Last Updated : Apr 18, 2019, 01:04 PM IST
టీడీపీ Vs వైసీపీ: పైకి గెలుపుపై ధీమా ..లోలోపల ఓటమి భయం..ఎందుకిలా ?

ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రధాన రాజకీయ పార్టీలైన వైసీపీ, టీడీపీ గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ తమకు 125 తగ్గకుండా వస్తాయని చెబుతూ విజయంపై ధీమా వ్యక్తం చేస్తుంటే...వైసీపీ మరో అడుగు ముందుకేసి తమకు 140కి తగ్గకుండా వస్తాయని ధీమా వ్యక్తం చేస్తూ మంత్రివర్గ ఏర్పాటుపై చర్చకు తెరదీసింది. 

నాణేనికి మరోవైపు మరోకటి..

ఇది పైకి కనిపించే అంశంమైతే ఇరు పార్టీలకు లోలోపల ఓటమి భయం పట్టుకుందట. దానికి కారణాలు లేకపోలేదు. పోలింగ్ సరళిని గమనించిన విశ్లేషకులు ఈ సారి వైసీపీ టీడీపీ మధ్య పోరు హోరా హోరీగా జరిగినట్లు అభిప్రాయపడుతున్నారు. గతంలో కంటే ఈ సారి టఫ్ ఫైట్ నడించిందనే వాదన వినిపిస్తోంది

స్వల తేడాతో గెలుపోటములు

గత ఎన్నికల్లో టీడీపీ 5 వేల మెజార్టీ లోపు 29 స్థానాలు కోల్పోగా..వైసీపీ 16 సీట్లు కోల్పోయింది. పోలింగ్ సరిళిని గమనించిన మేధావులు ఈ సారి చాలా చోట్ల అభ్యర్ధుల గెలుపోటముల మధ్య వ్యత్యాసం చాల  తక్కువ ఓట్లు ఉంటాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ, వైసీపీ పార్టీలకు ఓట్లు చీలిక, క్రాస్ ఓటింగ్ భయం పట్టుకుంది. ముఖ్యంగా పవన్ పార్టీ ఎవరి ఓట్లను చీల్చిందనేది రాజకీయ పార్టీలు తేల్చుకోలేకపోతున్నాయి. 

Trending News