హైదరాబాద్: తెలుగు తరాలు చిరకాలం గుర్తించుకునే నట సార్వభౌముడు, దివంగత నేత ఎన్టీఆర్ కు లైవ్ పర్సనాలిటిగా కనిపించే ఆయన కుమారుడు బాలకృష్ణ ..తండ్రి ఎన్టీఆర్ నటవారసుడిగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. పర్ఫామెన్స్ లో ఎప్పటికప్పుడు ఫ్లూవ్ చేసుకుంటూ తండ్రిగా తగ్గ తనయుడిగా గుర్తింపు పొందిన బాలయ్య... ఈ రోజు తన 59వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. తన తండ్రి ఎన్టీఆర్ నిర్మించిన బస్వతారక క్యాన్సర్ ఆస్పత్రిలో క్యాన్స ర్ బాధిత చిన్నారులతో కలిసి పుట్టిన రోజు వేడుకులు జరుపుకున్నారు. స్వయంగా తన చేతులతో చిన్నారులకు కేక్ తినిపించి సేవా గుణాన్ని చాటుకున్నారు బాలయ్య
జీవితానికి అర్థం ఉండాలి - బాలయ్య
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాలకృష్ణ ఉద్వేగంగా ప్రసంగించారు. ఎవరైనా ఈ భూమి మీద పుట్టితే ...ఆ జన్మకు సార్ధకత ఉండాలన్నారు. తాను పుట్టిన గడ్డకు..తాను పుట్టిన జాతికి..రాష్ట్రానికి..ఇలా దేశానికి ఏదో రకంగా ప్రయోజనం చేయాలన్నారు. ఈ విషయంలో తన తండ్రి ఎన్టీఆరే తనకు స్పూర్తి అంటూ బాలయ్య ఉద్దేగానికి లోనయ్యారు. ఎన్టీఆర్ తరహా సమాజసేవలో తన వంతు పాత్ర పోషిస్తునందుకు గర్వంగా భావిస్తున్నానని బాలయ్య తెలిపారు. భవిష్యత్తు మరింత సేవా కార్యక్రమాలు చేపడతాని ఈ సందర్భంగా బాలయ్య ప్రకటించారు. బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో అభిమానుల సంబరాలు చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.