Heavy Rains Alert: తెలుగు రాష్ట్రాల్లో మరోసారి మోస్తరు నుంచి భారీ వర్షాలు తప్పేట్లు లేవు. బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడటమే ఇందుకు కారణం. రానున్న 2 రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలోని వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం ఇవాళ ఉదయానికి తీవ్ర అల్పపీడనంగా బలపడింది. రానున్న 12 గంటల్లో వాయుగుండంగా మారనుంది. ప్రస్తుతం ఇది ఉత్తర బంగాళాఖాతం మధ్యలో కొనసాగుతూ సముద్రమట్టం నుంచి 9 కిలోమీటర్ల వరకూ విస్తరించి ఉంది. దేశంలో పశ్చిమ దిశ నుంచి తెలంగాణవైపుగా బలమైన గాలులు వీస్తుండటంతో తెలంగాణ వ్యాప్తంగా రానున్న 2 రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ సూచించడంతో ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
మరోవైపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ముఖ్యంగా అదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, వరంగల్, హనుమకొండ, జనగాం, మెదక్, రంగారెడ్డి, కామారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరిలలో మోస్తరు వర్షాలు ఉరుములు, మెరుపులతో పడే అవకాశాలున్నాయి. అదే సమయంలో హైదరాబాద్ నగరానికి మాత్రం ఎల్లో అలర్ట్ జారీ కావడంతో అధికారులు అప్రమత్తమౌతున్నారు. రేపటి వరకూ హైదరాబాద్ నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చు.
అల్పపీడనం ప్రభావంతో ఏపీలో రానున్న మూడ్రోజులు భారీ వర్షాలు పడతాయని ఐఎండీ వెల్లడించింది. ఇప్పటికే ఏపీలోని పలుప్రాంతాల్లో చెదురుముదురు వర్షాలు పడుతున్నాయి. అల్పపీడనం ప్రభావంతో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు తప్పేట్టు లేవు. అయితే ఇప్పుడున్న అల్పపీడం ఏపీవైపుకు కదిలితే భారీ వర్షాలు పడతాయి. ఇదిలా ఉంటే గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఇటు ధవళేశ్వరం వద్ద కూడా రెండవ ప్రమాద హెచ్చరిక నడుస్తోంది. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 175 గేట్లను ఎత్తివేసి 16 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Heavy Rains Alert: బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం, ఏపీ, తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు