చిత్తూరు జిల్లాలో కుండపోత వర్షాలు..విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం..

చిత్తూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తుండటంతో జిల్లాలోని రేణిగుంట విమానాశ్రయంలో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 18, 2021, 04:35 PM IST
చిత్తూరు జిల్లాలో కుండపోత వర్షాలు..విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం..

Flights Diverted: చిత్తూరు జిల్లాలో కుండపోత వర్షాలు(Heavy Rains in Chittor District) కురుస్తున్నాయి. దీంతో రేణిగుంట ఎయిర్ పోర్టు(Renigunta Airport)లో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాతావరణం అనుకూలించక  పోవటంతో...విమానాలు తిరిగి(Flights Diverted) హైదరాబాద్ వెళ్తున్నాయి. ఎయిర్‌ ఇండియా, స్పైస్‌ జెట్‌ విమానాలు హైదరాబాద్‌కు వెనుదిరిగాయి. హైదరాబాద్-రేణిగుంట ఇండిగో విమానాన్ని విమానాశ్రయ అధికారులు బెంగళూరుకు మళ్లించారు.

Ship Repairing Unit: ఏపీలో త్వరలో షిప్ రిపేరింగ్, రీ సైక్లింగ్ యూనిట్ల ఏర్పాటు

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తిరుపతి(Tirupati) నగరం జలమయమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు జలమయం కావడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. ఈ వర్షాలకు తిరుమల కనుమదారిలోని కొండ చరియలు(Land slides) విరిగి పడుతున్నాయి. అప్రమత్తమైన తితిదే అధికారులు వాటిని ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. భారీ వర్షం కారణంగా అలిపిరి, శ్రీవారి కాలినడక మార్గాలతో పాటు.. పాపవినాశనం రహదారిని తితిదే (TTD) మూసివేసింది.

విద్యాసంస్థలకు సెలవు

భారీ వర్షాల నేపథ్యంలో.. చిత్తూరు జిల్లాలో గురు, శుక్రవారాల్లో అన్ని విద్యా సంస్థలకు జిల్లా కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ సెలవు ప్రకటించారు. పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎస్‌డీఆర్‌ఎఫ్‌‌, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధంగా ఉంచామనీ.. జిల్లాలో ఎక్కడైనా అవసరమైతే సేవలను వినియోగించుకుంటామన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook 

 

Trending News