Andhra Pradesh weather report: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తున్నాయి. దీంతో చెరువులు, ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. కాగా.. ఉపరితల ఆవర్తనం కారణంగా బంగాళాఖాతం(Bay of Bengal)లో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మరో మూడు రోజులపాటు ఆంధ్రప్రదేశ్(Andhrapradesh)లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం ఉత్తరం బంగాళాఖాతం నుంచి తూర్పు మధ్య బంగాళాఖాతం లలో సగటు సముద్ర మట్టం నుండి 4.5 కి మీ వరకు విస్తరించి ఉన్నట్లు తెలిపింది. ఇది నైరుతి దిశకు కొనసాగుతున్నది. దీని ప్రభావం వలన రాగల 24 గంటలలో ఉత్తర, మధ్య బంగళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడే అవకాశమున్నట్లు వాతావరణ అధికారులు ఆదివారం తెలిపారు.
దీని కారణంగా ఈరోజు, సోమవారం, మంగళవారం ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవారణ విభాగం తెలిపింది. కాగా.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రేపు తీరం వెంబడి ఈదురుగాలులు 40-50 కిమీ వేగంతో వీచే అవకాశం ఉంది.
Also read: AP Corona Update: ఏపీలో స్థిరంగా కొనసాగుతున్న కరోనా పాజిటివ్ కేసులు, తగ్గిన మరణాలు
దక్షిణ కోస్తా ఆంధ్ర:
ఈరోజు, సోమవారం, మంగళవారం దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతోపాటు కృష్ణా, గుంటూరు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
రాయలసీమ:
రాయలసీమలో ఈరోజు, సోమవారం, మంగళవారం ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాగా.. అనంతపురం కర్నూలు, చిత్తూరు, కడప జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకులు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook