Heavy Rains Alert: రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. వడగళ్ల వాన, ఈదురుగాలులతో పంటపొలాలు దెబ్బతిన్నాయి. పశ్చిమ బెంగాల్ నుంచి జార్ఘండ్ మీదుగా ఒడిశా వరకూ విస్తరించిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాగల 36 గంటలు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని హెచ్చరిక చేసింది వాతావరణ శాఖ.
ఇప్పటికే బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్ నుంచి జార్ఘండ్ మీదుగా ఒడిశా వరకూ అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. మరోవైపు ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకణ్ వరకూ మరో ద్రోణి ఏర్పడటంతో బంగాళాఖాతం మీదుగా రాష్ట్రంలోని తేమగాలులు వీస్తున్నాయి. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. వడగళ్ల వాన, గాలి బీభత్సంతో పంట పొలాలు దెబ్బతిన్నాయి. అరటి, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులతో సమీక్షించారు. పంటనష్టంపై ప్రాధమిక సమాచారాన్నిసేకరించారు. నష్ట పరిహారంపై వెంటనే ఎన్యుమరేషన్ ప్రారంభించాలని అధికారుల్ని ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు వహించాలన్నారు.
మరో రెండ్రోజులు భారీ వర్షాలు
రాష్ట్రంలోని నెల్లూరు, విశాఖ, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షం నమోదైంది. రాగల రెండ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. విజయవాడ, విశాఖపట్నం నగరాల్ని భారీ వర్షాలు ముంచెత్తవచ్చని హెచ్చరిస్తోంది ఐఎండీ.
Also read: AP Weather Report: నేడు ఈ జిల్లాలకు భారీ రెయిన్ అలర్ట్.. పిడుగులు పడే అవకాశం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook