Heavy Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, ఇవాళ కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన

Heavy Rains: బంగాళాఖాతంలో మరోసారి అల్పపీడనం ఏర్పడనుంది. ఇప్పటికే కోస్తా తీరంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి కారణంగా ఇవాళ కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురవనున్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 7, 2021, 10:11 AM IST
Heavy Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, ఇవాళ కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన

Heavy Rains: బంగాళాఖాతంలో మరోసారి అల్పపీడనం ఏర్పడనుంది. ఇప్పటికే కోస్తా తీరంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి కారణంగా ఇవాళ కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురవనున్నాయి.

ఉక్కపోతతో తల్లడిల్లుతున్న ప్రజానీకానికి కాస్త ఊరట కలగనుంది.ఇవాళ కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ(IMD) వెల్లడించింది. ఉత్తర కోస్తా తీరంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి నిన్నటికి బలహీనపడిందని తెలిపింది. ఈ నెల 11 లేదా 12 తేదీల్లో బంగాళాఖాతంలో(Bay of Bengal) కోస్తాకు సమీపంలో అల్పపీడనం (Low Depression) ఏర్పడవచ్చని ఐఎండీ పేర్కొంది. క్రమంగా ఈ అల్పపీడనం దిశ మార్చుకుని ఒడిశా వైపు పయనించే అవకాశాలున్నాయి. ఫలితంగా ఈ నెల 11, 12 తేదీల్లో రాష్ట్రమంతా విస్తారంగా వర్షాలు పడనున్నాయి. గత 24 గంటల్లో ఏపీలోని విజయనగరంలో 7 సెంటీమీటర్లు, గరివిడిలో 5.8 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో ఇవాళ, రేపు మోస్తరు వర్షాలు పడనుండగా..కోస్తాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇవాళ భారీ వర్షాలు (Heavy Rains) పడతాయి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం రుతపవనాలు బలహీనంగా ఉండటంతో రాయలసీమలో ఎక్కువగా వర్షాలు పడే సూచనలు కన్పిస్తున్నాయి.

Also read: Sajjala Ramakrishna Reddy: తెలంగాణ తీరుపై..కేసీఆర్‌పై సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News