Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా బలపడి వాయుగుండంగా మారడంతో వర్షాల తీవ్రత పెరిగింది. ఏపీలో మరో మూడ్రోజులు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడవచ్చని ఐఎండీ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కొన్ని జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్‌లో కుండపోతగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోస్తా జిల్లాల్లో ప్రభావం ఎక్కువగా కన్పిస్తోంది. వరుసగా 4 రోజుల్నించి ఏపీలో ముసురు పట్టుకుంది. కొన్ని జిల్లాల్లో తీవ్రమైన వర్షాలుంటే మరి కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. నిన్న అంటే బుధవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా సరాసరిన 2.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల తీవ్రత అధికంగా ఉన్న జిల్లాలు విశాఖ, నంద్యాల, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.
మరోవైపు భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరిక నేపధ్యంలో వాతావరణ శాఖ రాష్ట్రంలో పది జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, గుంటూరు, పల్నాడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి.
ఇక విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ప్రకాశం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు పడనుండటంతో ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. ఈ జిల్లాల్లో వర్షాలతో పాటు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీయనున్నాయి. సముద్రం కూడా అల్లకల్లోలంగా ఉండటంతో వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు సూచించారు.
ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం ఈనెల 29 వరకూ ఉండనుంది. అయితే అక్కడితే వర్షాలు ఆగే పరిస్థితి లేదు. అల్పపీడనానికి తోడు ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి వాయువ్య దిశగా కదులుతోంది. మరోవైపు బంగాళాఖాతంలో ఆగస్టు 2నాటికి మరో అల్పపీడనం ఏర్పడవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ అల్పపీడనం ఉత్తరాంధ్ర, ఒడిశా మధ్య కేంద్రీకృతం కావచ్చని తెలుస్తోంది.
Also read: AP Minister Roja, Kodali Nani : కొడాలి నానితో కలిసి రోజా హల్చల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook