Heavy Rain in Andhra Pradesh: ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ మీదుగా అల్పపీడన ప్రాంతంగా గుర్తించినట్లు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి అల్పపీడనంగా కేంద్రీకరించే అవకాశం ఉందని చెప్పారు. మంగళవారం సాయంత్రానికి వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు.
క్రమంగా ఎల్లుండి ఉదయానికి తుఫానుగా మారి.. ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి, దక్షిణకోస్తాంధ్ర ఆంధ్ర తీరాలకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో దక్షిణకోస్తాలోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, రాయలసీమలోని చిత్తూరు, కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.
As per IMD forecast of 06th Dec 2022 at 08:15 AM;
The Low Pressure Area over Southeast Bay of Bengal and adjoining south Andaman become Well Marked Low Pressure Area over Southeast BOB It is likely to move west-north westwards and concentrate into a Depression over (1/4)
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) December 6, 2022
మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశ ఉందని అన్నారు. వర్షాల నేపథ్యంలో ఇప్పటికే ప్రభావిత జిల్లాల యంత్రాంగానికి సూచనలు జారీ చేశామన్నారు. దక్షిణకోస్తాంధ్ర-తమిళనాడు తీరాల వెంబడి శుక్రవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
మరోవైపు రాగ మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాష్ట్రానికి ఎలాంటి వర్ష సూచన లేదని చెప్పారు. అయితే ఈశాన్య దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపు గాలులు వీస్తున్నాయన్నాయని వెల్లడించారు.
Also Read: LIC Scheme: వృద్ధాప్యంలో ఖర్చుల టెన్షన్.. ఈ పాలసీ తీసుకుంటే ప్రతి నెలా పెన్షన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి