AP: విజయవాడ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత

విమానాశ్రయాల సాక్షిగా అక్రమ బంగారం స్మగ్లింగ్ ఎక్కువవుతోంది. ఏపీలోని రెండు ప్రధాన విమానాశ్రయాల్లో బంగారం పట్టుబడుతోంది. మొన్న విశాఖపట్నం ఎయిర్ పోర్ట్..నేడు విజయవాడ ఎయిర్ పోర్ట్.

Last Updated : Nov 19, 2020, 08:54 PM IST
AP: విజయవాడ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత

విమానాశ్రయాల సాక్షిగా అక్రమ బంగారం స్మగ్లింగ్ ఎక్కువవుతోంది. ఏపీలోని రెండు ప్రధాన విమానాశ్రయాల్లో బంగారం పట్టుబడుతోంది. మొన్న విశాఖపట్నం ఎయిర్ పోర్ట్..నేడు విజయవాడ ఎయిర్ పోర్ట్.

కేరళ ( Kerala ) తిరువనంతపురం ఎయిర్ పోర్ట్ ( Tiruvanantapuram airport ) లో భారీగా బంగారాన్ని అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన సంఘటనలు తెలిసిందే. కేరళ గోల్డ్ స్కాం ( Kerala Gold scam ) ఆ రాష్ట్రంలో పెను ప్రకంపనాలు సృష్టించింది. ఇప్పుడు అదే అక్రమ బంగారం రవాణాకు ఏపీ విమానాశ్రయాలు వేదికగా మారుతున్నాయి. ఇటీవల కొద్దిరోజుల క్రితం విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ ( Visakhapatnam Airport ) లో భారీగా బంగారం పట్టుబడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్ట్ అందుకు వేదికైంది. ఇవాళ విజయవాడ ఎయిర్ పోర్ట్ ( Vijayawada Airport ) లో భారీగా బంగారాన్ని( Heavy gold seized ) రవాణా చేస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. కువైట్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణీకుల్ని అనుమానంతో తనిఖీ చేయగా..ఏ విధమైన పత్రాలు లేని 1 కేజీ 865 గ్రాముల బంగారం దొరికింది. పట్టుబడిన బంగారం విలువ 95 లక్షల 11 వేల 5 వందలుంటుందని కస్టమ్స్ అడిషనల్ కమీషనర్ నాగేంద్రరావు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దర్ని అరెస్టు చేశామన్నారు. ఈ బంగారాన్ని ఎక్కడికి తరలిస్తున్నారనేది దర్యాప్తు చేస్తున్నామన్నారు. Also read: AP: చరిత్రలో నదీ స్నానాల్లేకుండా జరగనున్న తొలి పుష్కరాలు

 

Trending News